‘నా పద్మ శ్రీ అవార్డు తిరిగి ఇచ్చేస్తా.. కానీ’.. కంగనా రనౌత్ మరోసారి ఫైర్.. ప్రశ్నల వర్షం

By telugu team  |  First Published Nov 13, 2021, 4:25 PM IST

కంగనా రనౌత్ తనపై వస్తున్న విమర్శలకు ఎదురుదాడి చేశారు. తన ప్రశ్నలకు సమాధానాలిస్తే తన పద్మ శ్రీ అవార్డు  తిరిగి ఇస్తానని, అంతేకాదు, తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెబుతానని అన్నారు. జాతీయ వాదం, రైట్ వింగ్, 1947నాటి కాంగ్రెస్ గురించి ఆమె ప్రశ్నలు వేశారు. అంతేకాదు, 2014లో స్వాతంత్ర్యం వచ్చిందన్న తన వ్యాఖ్యలనూ సమర్థించుకున్నారు.
 


న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి Kangana Ranautకు ఇచ్చిన Padma Shri Award వెనక్కి తీసుకోవాలని, ఆమెను అరెస్టు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పద్మ శ్రీ అవార్డు వెనక్కి ఇచ్చేస్తారని అన్నారు. కానీ, తన ప్రశ్నలకు ముందుగా సమాధానం చెప్పాలని తెలిపారు. తన Questionsకు సమాధానం చెప్పితే తర్వాత పద్మ శ్రీ అవార్డు తిరిగి ఇచ్చేస్తారని చెప్పారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ బ్రిటీషర్లకు కొనసాగింపుగానే 1947లో కాంగ్రెస్ పాలన సాగిందని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని నోరుపారేసుకున్నారు. అంతేకాదు, 1947లో బ్రిటీషర్లు భిక్షం వేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఆమెపై బీజేపీ సహా ఇతర అన్ని పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పద్మ శ్రీ అవార్డు వెనక్కి తీసుకోవాలనే డిమాండ్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు చేశారు.

‘ఆ ఇంటర్వ్యూలోనే తాను 1857 సంగ్రామం గురించి స్పష్టంగా ప్రస్తావించాను. వారితోపాటు సుభాష్ చంద్రబోస్, లక్ష్మీబాయి, వీర్ సావర్క్‌ల త్యాగాలనూ మాట్లాడాను. 1857లో జరిగిన పోరాటం తెలుసు కానీ, 1947లో ఎలాంటి యుద్ధం జరిగిందో నాకు తెలియదు. దీనిపై నాకు అవగాహన కలిగిస్తే నా పద్మ శ్రీ అవార్డును వెనక్కి ఇస్తా.. అంతేకాదు, నా వ్యాఖ్యలకు క్షమాపణలూ చెబుతా. దయచేసి నాకు హెల్ప్ చేయండి’ అంటూ పోస్టు చేశారు. ఈ పోస్టులో ఆమె కాంగ్రెస్‌ను ‘అడుక్కుతినేది’ అని పేర్కొనేట్టుగా రాసుకొచ్చారు. ఓ చరిత్ర పుస్తకం నుంచి కొన్ని ఫొటోలను పోస్టు చేశారు. కానీ, ఆ పుస్తకం పేరు పేర్కొననేలేదు.

Latest Videos

undefined

Also Read: ‘1947లో భిక్షం.. 2014లోనే దేశానికి స్వాతంత్ర్యం’.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ఫైర్

‘కొన్ని విషయాలను సరి చేస్తాను. కాంగ్రెస్‌ను బెగ్గర్ అని పిలిచేది నేను ఒక్కదాన్నే కాదు’ అని అన్నారు.

తాను మణికర్ణిక సినిమా చేసేటప్పుడు 1857 సంగ్రామం గురించి ఎంతో తెలుసుకున్నారని కంగనా రనౌత్ అన్నారు. ‘జాతీయవాదం ఉదయించినట్టే రైట్ వింగ్ కూడా అభివృద్ధి చెందింది. కానీ, ఎందుకు ఆకస్మికంగా కనిపించకుండా పోయింది? ఎందుకు భగత్‌సింగ్‌ను చనిపోతుంటే గాంధీ ఆపలేదు? సుభాష్ చంద్ర బోస్ ఎందుక గాంధీ మద్దతు చూరగొనలేకపోయాడు? విభజన రేఖను ఆ శ్వేతవర్ణ మనిషే ఎందుకు గీశాడు? స్వాతంత్ర్యం గురించి భారతీయులు సంబురాలు చేసుకోకుండా ఎందుకు పరస్పరం చంపుకున్నారు? ఈ ప్రశ్నలకు నేను సమాధానాలు కోరుతున్నాను. దయచేసిన నాకు సమాధానాలు తెలుపండి’ అంటూ ఆమె తన విమర్శకులపై విరుచుకుపడ్డారు.

Also Read: కంగనా నుంచి పద్మ అవార్డు వెంటనే వెనక్కి తీసుకోవాలి.. పార్టీల డిమాండ్

అంతేకాదు, ఐఎన్ఏ ఒక చిన్న యుద్ధం చేస్తే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చేదని, సుభాష్ చంద్రబోస్ ప్రధానమంత్రి అయ్యేవాడు అనీ పేర్కొన్నారు. అంతేకాదు, రైట్ వింగ్ పోరాడి స్వాతంత్ర్యం పొందడానికి సిద్ధమవుతుంటే.. కాంగ్రెస్ అడుక్కుతినే కంచంలో ఎందుకు స్వాతంత్ర్యం వేశారు? అని ప్రశ్నించారు. వీటిపై సమాధానాలు ఇవ్వాల్సిందిగా కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో పేర్కొన్నారు.

2014లో స్వాతంత్ర్యం వచ్చిందన్న తన వ్యాఖ్యలనూ ఆమె సమర్థించుకున్నారు. భౌతికంగా అందరికీ స్వాతంత్ర్యం వచ్చిందని, కానీ, మనస్సాక్షిగా, వివేచనాపరమైన స్వాతంత్ర్యం 2014లో వచ్చిందని పేర్కొన్నట్టు తెలిపారు. మరణించిన ఓ నాగరికత మళ్లీ జీవం పోసుకుని తన రెక్కలు విప్పుకుందని, ఇప్పుడు మరింత పైకి ఎగురుతున్నదని పేర్కొన్నారు.

click me!