#మీటూ అంటున్న గుత్తా జ్వాలా.. షాకింగ్ కామెంట్స్

By ramya neerukondaFirst Published Oct 10, 2018, 10:08 AM IST
Highlights

తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల చేరారు.

దేశవ్యాప్తంగా #మీటూ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటి వరకు కేవలం సినీ తారలు మాత్రమే తమను వేధించన వాళ్ల పేరు బయటపెట్టారు. తాజాగా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల చేరారు. తాను కూడా వేధింపులకు గురయ్యానని.. కాకపోతే అవి మానసిక వేధింపులు అంటూ జ్వాల వరుస ట్వీట్‌లు చేశారు.

 

Maybe I should talk about the mental harassment I had to go through...

— Gutta Jwala (@Guttajwala)

‘#మీటూ ద్వారా నేను నాకు ఎదురైన మానసిక వేధింపులు గురించి వెల్లడించాలనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్‌ అయ్యాడు. అప్పటి నుంచి నన్ను మానసిక వేధింపులకు గురి చేశాడు. నేషనల్‌ చాంపియన్‌ అయిన నన్ను జట్టు నుంచి బయటకు పంపించాడు. నేను బ్యాడ్మింటన్‌కు రాజీనామా చేయడానికి ఇది కూడా ఓ కారణం. నన్ను బయటకు పంపించడమే కాకుండా నాతో పాటు ఆడే నా పార్ట్‌నర్స్‌ని కూడా బెదిరించాడు. నేను రియో ఒలంపిక్స్‌ నుంచి వచ్చిన తరువాత కూడా ఈ వేధింపులు కొనసాగాయి. నేను ఎవరితో అయితే కలిసి మిక్స్‌డ్ ఆడతానో తనను కూడా బెదిరించారు. దాంతో నేను జట్టు నుంచి బయటకు వచ్చేశాను’ అంటూ జ్వాల ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

నాతో బలవతంగా మందు తాగించి రేప్ చేశాడు.. నటుడిపై ఆరోపణలు!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు!

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

ఆ నిర్మాత దారుణంగా హింసించాడు.. నటి ఫోటోలు వైరల్!

click me!