
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలీలో బుధవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో ఏడుగురు మరణించగా, పలువురు గాయపడ్డారు.
బుధవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో రాయబరేలీలోని హర్చంద్ పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో న్యూ ఫరక్కా ఎక్స్ ప్రెస్ రైలు పట్టాలు తప్పింది.
సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. రైల్వే బోర్డు చైర్మన్ అశ్వని లోహాని కూడా సంఘటనా స్థలానికి చేరుకుంటున్నారు.
అవసరమైన సహాయం అందించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను, వైద్యాధికారులను ఆదేశించారు.