Today Top Stories: బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ క్లారిటీ.. టీడీపీకి ఎదురుదెబ్బ.. 'సైంధవ్' ప్రీమియర్ షో రివ్యూ

By Rajesh Karampoori  |  First Published Jan 13, 2024, 6:09 AM IST

Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో  TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల, ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ క్లారిటీ, టీడీపీకి ఎదురుదెబ్బ.. రాయపాటి రంగారావు రాజీనామా, రఘరామకృష్ణంరాజుకు ఊరట,  అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని మోడీ, సైంధవ్' ప్రీమియర్ షో రివ్యూ,  కమల్‌ హాసన్‌ కొత్త సినిమా..  వంటి పలు వార్తల సమాహారం


Today Top Stories:  TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల

TSPSC Notification: ఇటీవల టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వారి రాజీనామాలను గవర్నర్ తమిళిసై కూడా ఆమోదించారు. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, సభ్యుల పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Latest Videos

Praja Palana: ప్రజా పాలన దరఖాస్తుల్లో తప్పులుంటే ఎలా? సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు


ప్రజా పాలన కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సవరించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆ దరఖాస్తులో పేర్కొన్న ఫోన్ నెంబర్‌కు కాల్ చేసి మరీ ఆ తప్పులను సవరించాలని ఆదేశాలు జారీ చేశారు. అన్ని వివరాలు సరిగ్గా తీసుకున్న తర్వాత ఆన్‌లైన్‌లోకి డేటాను ఎంటర్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు కాంగ్రెస్ లీడర్ కస్తూరి నరేంద్ర వివరించారు.

 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై బీఆర్ఎస్ క్లారిటీ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమికి తానే బాధ్యుడినని కేటీఆర్ అన్నారు. తాను కార్యకర్తలను పట్టించుకోవడంలో విఫలం అయినట్టు వివరించారు. దళిత బంధు, రైతు బంధు పథకాలతో కొంత వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. బీజేపీతో గతంలో పొత్తు లేదని, భవిష్యత్‌లోనూ ఉండబోదని స్పష్టం చేశారు.

టీడీపీకి ఎదురుదెబ్బ.. రాయపాటి రంగారావు రాజీనామా.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. టికెట్లు దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ రెండింట్లోనూ ఇదే పరిస్ధితి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని రాజీనామా చేయగా.. ఇప్పుడు పక్కనే వున్న గుంటూరు నుంచి ఆ పార్టీకి షాక్ తగిలింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశాన్ని నమ్ముకున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు .. రాయపాటి రంగారావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీతో పోస్ట్‌తో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనంతరం రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో టీడీపీలో పనిచేయలేనని రంగారావు పేర్కొన్నారు. 

రఘరామకృష్ణంరాజుకు ఊరట..  

నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజుకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆయన సొంతూరు వెళ్లేందుకు లైన్ క్లియర్ చేసింది. 41ఏ విధివిధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, అరెస్ట్ చేయకుండా రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

అటల్ సేతును ప్రారంభించిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ (prime minster narendra modi) శుక్రవారం మహారాష్ట్ర (maharstra)లో పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే భారతదేశంలోని అతి పొడవైన సముద్ర వంతెన అటల్ సేతును ( Indias longest sea bridge Atal Setu)ప్రారంభించారు. అటల్ సేతు బ్రిడ్జి నిర్మాణంతో  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం నవీ ముంబైకి వేగవంతమైన కనెక్టివిటిని అందిస్తుంది. భారతదేశపు పొడవైన సముద్ర వంతెన పొడవు 21.8 కి.మీ. ఇందులో  16.5  కి.మీ సముద్రంపైన ఉంటుంది. మిగిలిన ఐదు కి.మీ భూమిపై ఉంటుంది. ఈ బ్రిడ్జిపై  ప్రతి రోజూ కనీసం 40 నుండి 70 వేల వరకు ప్రయాణించే అవకాశం ఉందని  అధికారులు అంచనా వేస్తున్నారు. 

ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టవీ మృతి

హఫీజ్ సయీద్‌కు డిప్యూటీగా ఉన్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) వ్యవస్థాపక సభ్యుడు హఫీజ్ అబ్దుల్ సలామ్ భుట్టావీ మరణించినట్లు ధృవీకరించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గురువారం ప్రకటించింది. అతను 2008లో 26/11 దాడులకు కూడా కీలక కుట్రదారుడు. అతను మే 2023లో గుండెపోటుతో మరణించాడని యూఎన్ఎస్ సీ తెలిపింది.

Saindhav Review: 'సైంధవ్' ప్రీమియర్ షో రివ్యూ.. 

విక్టరీ వెంకటేష్ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కిన 75వ చిత్రం సైంధవ్‌. హిట్ 2 ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలోఈ చిత్రం రూపొందింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రుహాని శర్మ, శ్రద్దా శ్రీనాథ్, ఆండ్రియా జెర్మియా కీలక పాత్రల్లో నటించారు.  నేడు జనవరి 13న సంక్రాంతి కానుకగా సైంధవ్ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇలాంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాల్లో వెంకీ నటించడం చాలా అరుదు. యాక్షన్ తో పాటు వెంకీ అలవోకగా పండించగలిగే ఎమోషన్స్, సెంటిమెంట్ కి కూడా ఈ చిత్రంలో ప్రాధాన్యత ఉంది. ఆల్రెడీ యుఎస్  ప్రీమియర్ షోలు ప్రారంభమైన నేపథ్యంలో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందో చూద్దాం. 

KH237: కమల్‌ హాసన్‌ కొత్త సినిమా.. `KGF` ఫైట్‌ మాస్టర్లతో మూవీ..

కమల్‌ హాసన్‌  తాజాగా మరో సినిమాని ప్రకటించారు. అయితే అనూహ్యంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఫైట్‌ మాస్టర్లతో మూవీ చేస్తున్నాడు కమల్‌. పాపులర్‌ ఫైట్‌ మాస్టర్లు అన్భరివ్‌ (అన్బుమణి, అరివుమణి)లను దర్శకులుగా పరిచయం చేయబోతున్నారు. కవల ఫైట్‌ మాస్టర్లుగా ఇటీవల పాపులర్ అయ్యారీద్దరు. రామ్‌ లక్ష్మణ్‌ తరహాలో రాణిస్తున్నారు. `కేజీఎఫ్‌`, `విక్రమ్‌`, `లియో`, `దసరా` వంటి చిత్రాలు పనిచేశారు. ఇప్పుడు `కల్కి`, `ఇండియన్‌ 2`, `గేమ్‌ ఛేంజర్‌` వంటి సినిమాలకు వీరు పనిచేస్తున్నారు.

7 లక్షలకే కియా కొత్త కారు.. అప్ డేట్ ఫీచర్స్ తో లాంచ్..

డిసెంబర్ 2023లో ఆవిష్కరించిన కియా ఇండియా ఎట్టకేలకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను రూ. రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరతో ప్రవేశపెట్టింది. హ్యుందాయ్ వెన్యూకి కాంపిటీషన్ గా వస్తున్న ఈ కారు HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ అండ్ X-Line అనే ఏడు వేరియంట్‌లలో 11 ఎక్స్టీరియార్ పెయింట్ షేడ్స్‌లో అందించబడుతుంది. 

click me!