టీచర్లు వెకేషన్‌కు వెళ్లాలని ఏకంగా స్కూల్‌కే సెలవులు ప్రకటించారు.. ఎక్కడంటే?

By Mahesh K  |  First Published Jan 12, 2024, 9:39 PM IST

గుజరాత్‌లోని సూరత్ నగరంలోని ఓ స్కూల్ టీచర్లు పిక్నిక్ వెళ్లాలని అనుకున్నారు. అందుకోసం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా స్కూల్‌కు ఐదు రోజులు సెలవు ప్రకటించారు.
 


Teachers: సాధారణంగా టీచర్లు.. విద్యార్థులను పిక్నిక్‌కు తీసుకెళ్లుతారు. అందుకోసం ప్లాన్ చేసుకుని తల్లిదండ్రులకు ముందుస్తుగా ఇన్ఫామ్ చేస్తారు. ఆ తర్వాత పిల్లలను తీసుకుని పిక్నిక్‌కు వెళ్లుతారు. కానీ, సూరత్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్లు రూటే సెపరేటు. టీచర్లు పిక్నిక్ వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. వాళ్లంతా పిక్నిక్ వెళ్లుతున్నారు కాబట్టి, విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకూ సమాచారం ఇచ్చారు. టీచర్లు పిక్నిక్‌కు వెళ్లుతున్నారు కాబట్టి, స్కూల్‌కు ఐదు రోజులు (జనవరి 9 నుంచి 14వ తేదీ వరకు) సెలవులు ఇస్తున్నట్టు మెస్సేజీ చేశారు.

సూరత్ నగర మాజీ కార్పొరేటర్ అస్లాం ఫిరోజ్ బాయ్ సైకిల్‌వాలాకు ఈ విషయం తెలిసింది. ఆయన వెంటనే జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశాడు. మౌంట్ మేరీ మిషన్ హయర్ సెకండరీ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు మెస్సేజీ చేసిందని, టీచర్లు పిక్నిక్ వెళ్లుతున్నందున స్కూల్‌కు ఐదు రోజులు సెలవులు ప్రకటించిందని పేర్కొన్నారు.

Latest Videos

undefined

Also Read:TS News: పార్టీ ఓటమికి నేనే బాధ్యుడ్ని: కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ

ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఆ స్కూల్ యాజమాన్యం ఐదు రోజుల సెలవు కోసం ఎడ్యుకేషన్ ఆఫీసర్‌కు దరఖాస్తు చేసుకుంది. ఆ దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా వారికి జిల్లా విద్యాశాఖ అధికారి నోటీసులు పంపారు.

click me!