PM Modi | అజ్మీర్‌ దర్గాకు కానుకగా చాదర్‌ను పంపిన ప్రధాని మోదీ 

By Rajesh Karampoori  |  First Published Jan 13, 2024, 5:02 AM IST

PM Modi: ఉర్స్ సందర్భంగా అజ్మీర్ దర్గా షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ చాదర్‌ను బహుమతిగా ఇచ్చారు. జనవరి 13న ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో సమర్పించబడుతుంది. ముస్లిం ప్రముఖులు  ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు.  


PM Modi: అజ్మీర్ షరీఫ్ దర్గా ఐక్యతకు ఉదాహరణ,  భారతదేశ ఆధ్యాత్మిక,సాంస్కృతిక సంప్రదాయాలకు ప్రతీక. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్స్ సందర్భంగా అజ్మీర్‌ షరీఫ్‌ దర్గాకు ప్రధాని నరేంద్ర మోదీకి కానుగా చాదర్‌ను పంపారు. ఈ నెల 13న అజ్మీర్‌ ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాలో ఈ చాదర్‌ను సమర్పించనున్నారు. ముస్లిం ప్రముఖులు గురువారం ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను ప్రధాని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ముస్లిం ప్రతినిధుల బృందాన్ని కలిసినట్లు ప్రధాని పేర్కొన్నారు.

ఉర్స్ సమయంలో అజ్మీర్ షరీఫ్ దర్గాలో ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీకి సమర్పించే చాదర్‌ను అందించినట్లు చెప్పారు. అలాగే..ఈ సందర్భంగా  దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివెరియాలని సందేశం ఇచ్చారు.  దీనితో పాటు, శాంతి, ఐక్యత, సద్భావన సందేశం కోసం మన దేశంలోని సాధువులు, ఫకీర్లు ఎల్లప్పుడూ దేశ సాంస్కృతిక బలోపేతం చేశారని ప్రధాని తెలిపారు. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రతి సంవత్సరం ఉర్స్ సందర్భంగా అజ్మీర్ షరీఫ్ దర్గాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చాదర్‌ను అందజేస్తారు.

Latest Videos

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ఆయన సమర్పించిన చాదర్‌ను దర్గాలో సమర్పించారు. బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు తారీక్ మన్సూర్ లు  జనవరి 13 మధ్యాహ్నం అజ్మీర్ షరీఫ్‌లోని దర్గాలో ఈ చాదర్‌ను సమర్పించనున్నారు. ఈ సమయంలో పలువురు ముస్లిం నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 

812వ ఉర్స్ వేడుకలు

ఈ సంవత్సరం అజ్మీర్ షరీఫ్ దర్గాలో 812వ ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఉర్స్ సందర్భంగా ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గా వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ప్రధాని మోదీ పంపిన ఈ షీట్ జనవరి 13న అందించబడుతుంది. ప్రధాని మోదీ గత పదేళ్లుగా అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ లు పంపుతున్నారు.

click me!