Today Top Stories: శుభోదయం..ఈ రోజు టాప్ సోర్టీస్ లో ప్రజా పాలన పేరుతో సైబర్ మోసాలు, జయసుధ బీజేపీకి రాజీనామా, హాట్ టాపిక్ గా మారిన ముద్రగడ, గల్లా జయదేవ్ వ్యూహమేంటీ..?, స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అవార్డుల పంట,వైసీపీ మూడో జాబితా విడుదల, అయోధ్యకు ఉగ్రదాడి ముప్పు.. భద్రతా సంస్థలు హై అలర్ట్, తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం, గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ, 'హనుమాన్' రివ్యూ వంటి పలు వార్తల సమాహారం
Today Top Stories: Praja Palana:ప్రజా పాలన పేరుతో సైబర్ మోసాలు
Cyber Crimes: సైబర్ మోసగాళ్లు నయా అవతారం ఎత్తారు. ఇప్పుడు ప్రజా పాలన దరఖాస్తులను పరిశీలకులమని చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. మొన్నటి వరకు జరిగిన ప్రజా పాలనలో ప్రజలు చేసుకున్న దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, దరఖాస్తుల దారుల వివరాలను ఆసరాగా చేసి మభ్యపెడుతున్నారు. వారి నుంచి ఓటీపీ స్వీకరించి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్నారు.
అది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది...
తెలంగాణలో జరిగిన మొదటి శాసనసభ సమావేశంలో కాంగ్రెస్ కు చూపించింది ట్రైలర్ మాత్రమేనని… అసలు సినిమా ముందు ముందు ఉంటుందంటూ బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో జరిగిన మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఈసారి ఎన్నికల్లో అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. డిసెంబర్లో మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది.
బీజేపీకి జయసుధ గుడ్ బై.. కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ,
ప్రముఖ తెలుగు సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. అయితే జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, జయసుధ విషయాని వస్తే అనేక చిత్రాలలో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రధాన పాత్రలు పోషించారు. కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానం మేరకు జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జయసుధ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అదే స్థానం నుంచి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన జయసుధ విజయం సాధించలేకపోయారు. ఇక, జయసుధ 2016లో కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ చాలా వరకు ఆ పార్టీలో యాక్టివ్‌గా లేరు. అయితే 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జయసుధ వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
టీడీపీ లేదా జనసేనలోకి ముద్రగడ మొగ్గు..!
Mudragada Padmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నిన్నటి నుంచి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఈ జనవరి 1వ తేదీన తాను, తన కుమారుడు వైసీపీలోకి చేరబోతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కానీ, వైసీపీ నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో ముద్రగడ పద్మనాభం సైలెంట్ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ జనవరి 4వ తేదీన ముద్రగడకు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కాపు నేతలంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని కోరారు. నిన్న సాయంత్రం జనసేన నేతలు ముద్రగడను కలిశారు. సుమారు గంట సేపు వారు చర్చించారు. ఈ రోజు ఉదయం టీడీపీకి చెందిన కాపు నేతతోనూ ముద్రగడ భేటీ అయ్యారు.
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు , సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి వైసీపీ ఇన్‌ఛార్జ్‌ల మూడో జాబితా విడుదలైంది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఆమోదముద్ర వేసిన అనంతరం 23 మందితో కూడిన వైసీపీ అభ్యర్ధుల జాబితాను తాడేపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు. ఇప్పటి వరకు 38 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో, రెండో జాబితాలో 27 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ , సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఆయా పార్టీల్లో టికెట్లు దొరకని నేతలు, దొరకవని ముందే గ్రహించిన నాయకులు పక్కచూపులు చూస్తున్నారు. ఎవరు ఏ పార్టీలో వున్నారో తెలియని పరిస్ధితి నెలకొంది. అధికార, ప్రతిపక్షం ఇలా రెండూ పార్టీల్లోనూ నేతలు అసంతృప్త నేతలు వున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి పెద్ద ఎత్తున నేతలు వస్తున్న వేళ.. వైసీపీ సైతం కౌంటర్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీలు.. ఆ పార్టీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గ నేతలను వైసీపీ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఏపీకి అవార్డుల పంట
ఆంధ్రప్రదేశ్‌కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2023లో రాష్ట్రానికి నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు దక్కింది. దక్షిణ భారతదేశంలోని క్లీన్ సిటీల్లో ఏపీ నెంబర్‌వన్‌గా నిలిచింది. గుంటూరుకు జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్, గ్రేటర్ విశాఖకు ఆలిండియా 4వ ర్యాంక్, విజయవాడకు ఆలిండియా 6వ ర్యాంక్, తిరుపతి ఆలిండియా 8వ ర్యాంక్ సాధించాయి. నగరాలను అత్యంత పరిశుభ్రంగా తీర్చిదిద్దినందుకు గాను ఏపీకి ఈ అవార్డులు దక్కాయి.
కేశినేని నానికి వైఎస్ జగన్ ఇచ్చిన ఆఫర్ ఏంటీ ..
రోజులుగా నానుతున్న విషయానికి కేశినేని తెరదించారు. ఎన్నో అవమానాలు పడుతూ టీడీపీలో వున్నానని.. ఆస్తులు కూడా అమ్ముకున్నానని నాని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విజయవాడ నియోజకవర్గం కోసమే పార్టీలో నెట్టుకొస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. దీంతో నాని పార్టీ మారడం ఖాయమేనని అంతా ఫిక్స్ అయ్యారు. బుధవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో భేటీ అనంతరం తన మనసులోని మాటను మీడియాకు తెలిపారు. జగన్‌తో సమావేశం అనంతరం టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి , లోక్‌సభ ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు.
Earthquake : గురువారం ఢిల్లీలో పలు ప్రదేశాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా, పిర్ పంజాల్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.3గా నమోదైంది. పంజాబ్, ఛండీగఢ్, ఘజియాబాద్‌లలోనూ భూకంపం సంభవించింది. ఇంట్లోని తలుపులు , కిటికీలు, సామాగ్రి కుదుపులకు గురికావడంతో ప్రజలు ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.
అయోధ్యకు ఉగ్రదాడి ముప్పు.. భద్రతా సంస్థలు హై అలర్ట్
అయోధ్యకు ఉగ్ర దాడి ముప్పు పొంచి ఉందని ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం అందింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అలెర్ట్ అయ్యాయి. ఎలాంటి ఘటనలు జరకుండా చూసేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కేంద్ర సంస్థలు ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాయి.
ఆరంభం అదిరింది.. తొలి మ్యాచ్ లో భారత్ ఘన విజయం
IND vs AFG: అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొహాలీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.
అక్షర్ పటేల్, ముఖేష్ కుమ్రా డెత్ బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు తీశారు. అనంతరం భారత్ 17.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. శివమ్ దూబే శివతాండవం చేశారు. 40 బంతుల్లో 60 పరుగులతో అజేయంగా నిలిచాడు. అదే సమయంలో రింకు సింగ్ తొమ్మిది బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్ ఇండోర్‌లో జనవరి 14న జరగనుంది.
గుంటూరు కారం ట్విట్టర్ రివ్యూ...
Guntur Kaaram Review :సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఘాటు మసాలా లాంటి సినిమా గుంటూరు కారం. ఈమూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(జనవరి 12) రిలీజ్ అయ్యింది. ముందుగా గుంటూరు కారం మూవీ ప్రీమియర్స్ సందడి చేయగా.. ఆసినిమా చూసిన ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు.
ఫస్ట్ హాఫ్ మూవీ అయిపోగానే ట్విట్టర్ లో రెచ్చిపోయి పోస్ట్ లు పెట్టేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బ్లాక్ బస్టర్ మూవీ.. సూపర్ డూపర్ హిట్ అంటూ.. పోస్ట్ లు... కామెంట్లు పెడుతున్నారు. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ కట్టిపేడేసింది.. ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియనంతగా మెస్మరైజ్ చేసింది అంటున్నారు ట్విట్టర్ జనాలు.
Hanuman Review: ప్రశాంత్ వర్మ-తేజ సజ్జా కాంబినేషన్ లో వస్తున్న చిత్రం హనుమాన్. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న హనుమాన్ పాన్ వరల్డ్ రేంజ్‍లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ‘సూపర్ హీరో టూర్’ పేరుతో ప్రమోషన్లలో జోరుగా చేశారు. ఇదిలాఉంటే.. సంక్రాంతి బరిలో మహేష్ గుంటూరు కారం తో నాగార్జున నా స్వామి రంగ, సైoదవ్ తో వస్తుండగా..ఏమాత్రం వెనుకడువేయకుండా సినిమా కథ ఫై నమ్మకంతో డైరెక్టర్ ప్రశాంత్ , నిర్మాత నిరంజన్ హనుమాన్ ను రిలీజ్ చేశారు. ఏ మేరకు కలెక్షన్లను సాధిస్తుందో వేచి చూడాల్సిందే.