Dry Day: రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట జరిగే జనవరి 22.. ఈ రాష్ట్రాల్లో డ్రై డే

By Mahesh K  |  First Published Jan 11, 2024, 8:32 PM IST

జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తున్నారు. ఆ రోజు మందిరం గర్భగుడిలో రామ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. ఈ రోజున డ్రై డే పాటించాలని పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి.
 


Ram Temple: ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. రామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఈ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఈ రోజు పవిత్రంగా ఉండాలని పలువురు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే పలు ఎన్డీయే పాలిత రాష్ట్రాలు డ్రై డేను ప్రకటించాయి.

ఛత్తీస్‌గఢ్: అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభిస్తున్న జనవరి 22వ తేదీన సీఎం విష్ణు దేవ్ సాయి రాష్ట్రంలో డ్రై డే ప్రకటించారు. జనవరి 22న డ్రై డే ప్రకటించిన తొలి రాష్ట్రం ఛత్తీస్‌గఢ్. ఈ నిర్ణయాన్ని గత వారమే ప్రకరటించారు.

Latest Videos

undefined

అసోం: ఛత్తీస్‌గఢ్ నిర్ణయాన్నే అసోం కూడా ఫాలో అయింది. జనవరి 22న డ్రై డే పాటించాలని టూరిజం మంత్రి జయంత్ మల్ల బారువా ప్రకటించారు.

యూపీ: జనవరి 22న జరిగే కార్యక్రమం యూపీలోని అయోధ్యలోనే. ఈ ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా కూడా జనవరి 22న మందు లభించదని ప్రభుత్వం ప్రకటించింది.

Also Read : Bangles: ఒక్క కొడుకు ఉన్నవారికి ఇద్దరు కొడుకులున్నవారు గాజులు వేయాలా? పండితులు ఏమంటున్నారు?

వీటితోపాటు.. !

వీటితోపాటు మహారాష్ట్ర, రాజస్తాన్‌లోనూ డ్రై డే పాటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ రాష్ట్రాల్లో కూడా జనవరి 22న డ్రై డే పాటించాలనే ఆదేశాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. 

రామ మందిర ప్రారంభోత్సవం దేశవ్యాప్తంగా ఆసక్తికర పరిణామంగా మారింది. 

click me!