మత్తు మందు ఇచ్చి 120 మంది మహిళలపై రేప్.. 'జిలేబీ బాబా' కు 14 ఏళ్ల జైలు శిక్ష ఖరారు..

By team teluguFirst Published Jan 12, 2023, 8:53 AM IST
Highlights

వంద మందికి పైగా మహిళలపై అత్యాచారానికి పాల్పడిన జిలేబీ బాబాకు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ హర్యానాలోని ఫతేహాబాద్‌ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు చెప్పింది. 2018లో అతడిపై కేసు నమోదు కాగా తాజాగా తుది తీర్పు వచ్చింది. 

120 మంది మహిళలపై అత్యాచారం చేసి వాటిని వీడియోలు తీసిన స్వయం ప్రకటిత దేవుడు అమర్‌పురి అలియాస్ జిలేబీ బాబాకు 14 సంవత్సరాల జైలు శిక్ష ఖరారయ్యింది. హర్యానాలోని ఫతేహాబాద్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. అలాగే 35 వేల రూపాయిల జరిమానా విధించింది. నిందితుడు తన వద్దకు వచ్చే మహిళలను లొంగదీసుకొని, వారికి మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడేవాడు. ఆ వీడియోలను పబ్లిక్‌గా పెడతానని బెదిరించి డబ్బులు ఇవ్వాలంటూ బ్లాక్ మెయిల్ చేసేవాడు.

ఘోరం.. భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు.. ముగ్గురు మృతి, ఒకరికి గాయాలు

మైనర్ బాలికపై రెండుసార్లు అత్యాచారం చేసినందుకు పోస్కో చట్టంలోని సెక్షన్ 6 కింద అమర్ పురికి 14 ఏళ్ల జైలు శిక్ష, సెక్షన్ 376-సి కింద రెండు అత్యాచార కేసుల్లో ఒక్కొక్కరికి 7 సంవత్సరాల జైలు, ఐటి చట్టం సెక్షన్ 67-ఎ కింద ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ అదనపు జిల్లా జడ్జి బల్వంత్ సింగ్ తీర్పు చెప్పారు. అయితే ఆయుధాల చట్టం కేసులో అతన్ని నిర్దోషిగా విడుదల చేశారు. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు అవుతాయని, అతడు 14 సంవత్సరాలు జైలులో గడపాల్సి ఉంటుందని బాధితుల తరఫు న్యాయవాది సంజయ్ వర్మ తెలిపారు.

ప్రస్తుతం 63 సంవత్సరాలు ఉన్న జిలేబీ బాబాపై 2018 లో మొదటి సారిగా అత్యాచారం కేసు నమోదు అయ్యింది. తరువాత అతడిపై పలు అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అప్పటి నుంచి కోర్టులో విచారణ సాగుతోంది. చివరికి జనవరి 5వ తేదీన ఫతేహాబాద్ కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది. న్యాయమూర్తి దోషిగా నిర్ధారించడంతో జిలేబీ బాబా కోర్టు గదిలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. అత్యాచార బాధితుల్లో ఆరుగురు మహిళలు కోర్టుకు హాజరయ్యారు. ముగ్గురు బాధితుల వాంగ్మూలాల ఆధారంగా కోర్టు తీర్పు వెలువరించింది.

దారుణం.. నరబలి ఆచారంలో బాలుడి శిరచ్ఛేదం.. మృతదేహాన్ని ముక్కలుగా నరికి..

అసలు ఎవరు ఈ జిలేబీ బాబా ?
ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా హర్యానా పోలీసులు 2018లో ఫతేహాబాద్‌లోని తోహానా పట్టణంలో ఉండే అమర్‌పురిని అరెస్టు చేశారు. అతడి ఫోన్ నుంచి 120 సెక్స్ వీడియో క్లిప్పింగ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అమర్ పురి హర్యానాలోని తోహానాలోని బాబా బాలక్ నాథ్ మందిర్ లో ప్రధాన సాధువుగా ఉండేవాడు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ వ్యాఖ్యలపై కపిల్ సిబల్ ఫైర్ .. అసలేం జరిగింది?

అమర్‌పురి అంతకు ముందు జిలేబీలు అమ్మేవాడు. దీంతో అతడిని జిలేబీ బాబా అనే పేరు వచ్చింది. తనకు తంత్ర విద్యలు తెలుసని చెప్పడంతో మహిళలు తమ సమస్యలను పరిష్కరించాలని అతడిని ఆశ్రయించేవారు. దీంతో వారిని మచ్చిక చేసుకొని, మత్తుపదార్థాలను అందించి లైంగిక దోపిడికి పాల్పడేవాడు. ఈ దుశ్చర్యను వీడియోలు తీసేవాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే వాటిని బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేసేవాడు. జూలై 19, 2018న అతడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 292, 293, 294, 376, 384, 509, ఐటీ చట్టంలోని సెక్షన్ 67-ఏ కింద కేసు నమోదు చేశారు.
 

click me!