తమిళనాడులో డీఎంకే - కాంగ్రెస్ కూటమిలో ఎంఎన్ఎం చేరబోతోందా ? సందిగ్ధంలో కమల్ హాసన్..

తమిళనటుడు కమల్ హాసన్ 2018లో స్థాపించిన మక్కల్ నీది మయ్యం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రావడం లేదు. రాష్ట్రంలో డీఎంకే-కాంగ్రెస్ కూటమికి మద్దతు ఇవ్వాలా ? లేక సొంతంగానే పోటీ చేయాలా ? అనే విషయంలో కమల్ హాసన్ సందిగ్ధంలో ఉన్నారు. 

Is MNM going to join the DMK-Congress alliance in Tamil Nadu? Kamal Haasan in doubt..ISR

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపడుతున్న అనేక అంశాలపై తమిళ నటడు కమల్ హాసన్ కు చెందిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) ప్రకటిస్తోంది. ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కమల్ హాసన్ మద్దతు తెలిపారు. ఆయనతో పాటు కొంత దూరం నడిచారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే.. కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న ‘ఇండియన్’ కూటమిలో చేరింది. అయితే లోక్ సభ ఎన్నికల్లో ఈ డీఎంకే - కాంగ్రెస్ కూటమిలో ఎంఎన్ఎం చేరుతుందా ? లేదా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 

ఫస్ట్ నైట్ గదికి సోదరుడిని తీసుకెళ్లిన భర్త.. షాక్ అయిన నవ వధువు.. ఇద్దరూ కలిసి బలవంతంగా..

Latest Videos

అయితే ఇప్పటి వరకు మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) తమిళనాడులో కాంగ్రెస్-ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) కూటమిలో చేరడంపై ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని తెలుస్తోంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాట్నాలో, బెంగళూరులో జరిగిన ప్రతిపక్ష కూటమి సమావేశానికి ఎంఎన్ఎంకు ఆహ్వానం అందలేదు. అయితే కమల్ హాసన్, ఆయన ఎంఎన్ఎం ప్రతిపక్ష కూటమిలో భాగం కాదని, ప్రస్తుతం 2024 లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా తన ఓటు బ్యాంకును పెంచుకోవడంపై పార్టీ దృష్టి సారించిందని పార్టీ వర్గాలు వార్తా సంస్థ ‘ఐఏఎన్ఎస్’కు తెలిపాయి. త్వరలోనే లోక్ సభ ఎన్నికల పొత్తుపై కమల్ హాసన్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంతింటి నిర్మాణానికి లైన్ క్లియర్.. ఎక్కడ కడుతున్నారంటే ?

కాగా..  2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూరు సౌత్ స్థానం నుంచి పోటీ చేశారు. కానీ ఆయన బీజేపీ నాయకురాలు, మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతి శ్రీనివాసన్ చేతిలో ఓడిపోయారు. అయితే 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ఇది వరకే ప్రకటించారు. ఆయన కోయంబత్తూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. ప్రేమ పేరుతో వల వేసి, లాడ్జికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం.. మూడు రోజుల తరువాత..

జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీలు 2024 లోక్ సభ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమిని ఎదుర్కొనేందుకు ఇండియన్ నేషనల్ డెవలప్ మెంట్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (ఇండియా) పేరుతో కూటమిని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, సీపీఎం నేత సీతారాం ఏచూరి, నేషనల్ కాంగ్రెస్ నేత ఒమర్ అబ్దుల్లా సహా 50 మందికి పైగా రాజకీయ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
 

vuukle one pixel image
click me!