
పూణె : మహారాష్ట్రలోని పూణెలో విషాద ఘటన వెలుగుచూసింది. నగరంలోని ఓ 57 ఏళ్ల అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) సోమవారం తన భార్యను, మేనల్లుడిని తుపాకీతో కాల్చి చంపి.. ఆ తరువాత తానూ ఆత్మహత్య చేసుకున్నాడని ఒక అధికారి తెలిపారు.
బానర్ ప్రాంతంలోని ఏసీపీ భరత్ గైక్వాడ్ బంగ్లా వద్ద తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చతుర్‌శృంగి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. గైక్వాడ్ అమరావతి ఏసీపీగా విధులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారని.. ఆ తరువాత ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
కాలేజీ బాత్రూంలో తోటి విద్యార్థిని వీడియో తీసిన ముగ్గురమ్మాయిలు, సస్పెండ్ చేసిన యాజమాన్యం...
"సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో, ఏసీపీ మొదట తన భార్య తలపై కాల్పులు జరిపాడు. తుపాకీ కాల్పులు విన్న అతని కొడుకు, మేనల్లుడు పరుగున వచ్చి తలుపు తెరిచారు. వారు తలుపు తెరిచారు. ఆ క్షణంలో, అతను తన మేనల్లుడిపై కాల్పులు జరిపాడు. ఆ బుల్లెట్లు అతని ఛాతీకి తగిలాయి’ అని అధికారి తెలిపారు.
"ఆ తర్వాత గైక్వాడ్ తన తలపై కాల్చుకున్నాడు. ఈ ఘటనలో తుపాకీ దెబ్బ తిన్న వ్యక్తులు, కాల్చుకున్న వ్యక్తి ముగ్గురు అక్కడికక్కడే మరణించారు" అని అతను చెప్పాడు. మృతుల్లో ఇద్దరిని పోలీసు అధికారి భార్య మోని గైక్వాడ్ (44), మేనల్లుడు దీపక్ (35)గా గుర్తించారు. ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.