ప్రయాణీకులూ పారాహుషార్.. మీ చిరునామాలు రైల్వేశాఖ చేతిలో...!!

By Siva Kodati  |  First Published May 14, 2020, 8:22 PM IST

సుధీర్ఘ లాక్‌డౌన్ తర్వాత భారతీయ రైల్వే తన కార్యకలాపాలను స్వల్పంగా ప్రారంభించాయి. మే 12వ తేదీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధాన నగరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతుంది


సుధీర్ఘ లాక్‌డౌన్ తర్వాత భారతీయ రైల్వేలు తన కార్యకలాపాలను స్వల్పంగా ప్రారంభించాయి. మే 12వ తేదీ నుంచి దేశ రాజధాని ఢిల్లీ నుంచి ప్రధాన నగరాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నాయి. వీటిలో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల చిరునామాలను సేకరిస్తున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించింది.

తద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారి చిరునామా గల ప్రాంతంలో కరోనా వ్యాప్తి ఏ స్థాయిలో ఉందో తెలుసుకుని అందుకు తగ్గట్లు చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి.

Latest Videos

Also read:తల్లి ప్రేమ: అలసిన చిన్నారిని సూట్ కేసు పై లాక్కుంటూ 800 కిలోమీటర్లు

13వ తేదీ నుంచి ప్రయాణికుల చిరునామాలను సేకరించడం ప్రారంభించినట్లు పేర్కొంది. కాగా ప్రత్యేక రైల్వేకే ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోంది. బుకింగ్స్ ప్రారంభించిన కొన్ని గంటల్లోనే సుమారు 54 వేల మంది ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకున్నారని ఐఆర్‌సీటీసీ తెలిపింది.

తద్వారా సుమారు రూ.10 కోట్ల ఆదాయం సమకూరినట్లు రైల్వేశాఖ పేర్కొంది. కాగా ప్రత్యేక రైళ్లు, శ్రామిక రైళ్లు మినహా జూన్ 30 వరకు బుక్ చేసుకున్న అన్ని టికెట్లను రైల్వేశాఖ రద్దు చేసింది.

Also Read:భారత రైల్వే ప్రకటన... జూన్ 30వరకు పాసింజర్ రైళ్లు రద్దు

ఆ తేదీ వరకు బుక్ చేసుకున్న వారికి నగదును రీఫండ్ చేస్తామని ప్రకటించిందది. అలాగే ప్రత్యేక రైళ్లలో ప్రయాణించే వారు ఆహారం తమ వెంట తెచ్చుకోవడంతో పాటు గంటన్నర ముందుగానే స్టేషన్‌కు చేరుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. 

click me!