ప్రభుత్వోద్యోగులకు శుభవార్త: ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

By Siva Kodati  |  First Published May 14, 2020, 6:15 PM IST

లాక్‌డౌన్ భారతీయుల జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అసాధ్యమనుకున్న ఎన్నో పనులు లాక్‌డౌన్ కాలంలో జరిగాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వర్క్ ఫ్రమ్ హోమ్.


లాక్‌డౌన్ భారతీయుల జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. అసాధ్యమనుకున్న ఎన్నో పనులు లాక్‌డౌన్ కాలంలో జరిగాయి. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వర్క్ ఫ్రమ్ హోమ్. ఇన్నాళ్లు కార్పోరేట్ ఉద్యోగులకే పరిమితమైన ఈ అవకాశం లాక్‌డౌన్ పుణ్యమా అని ప్రభుత్వ ఉద్యోగులకు దక్కింది.

తద్వారా కుటుంబంతో గడిపే అవకాశం రావడంతో లాక్‌డౌన్‌లో వచ్చిన  మార్పులను కొనసాగించాలని ప్రభుత్వోద్యోగులు కోరుతున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఏడాదికి 15 రోజులు ఇంటి నుంచి పనిచేసేలా ముసాయిదాను సిద్దం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

Latest Videos

undefined

Also Read:నెల రోజుల్లో వీధి వ్యాపారులకు ప్రత్యేక స్కీమ్: నిర్మలా సీతారామన్

కేంద్ర సచివాలయంలో భౌతికదూరం నిబంధనలు అమలు చేసేందుకు ఇక ముందు హాజరు, పని గంటల్లో మార్పులు చేయాలని ఆ ముసాయిదాలో ప్రతిపాదించినట్లుగా సమాచారం. అన్ని మంత్రిత్వ శాఖల్లో ఈ-కార్యాలయంను అమలు చేయాలని డీవోపీటీ సూచించింది.

ఇప్పటికే 75 మంత్రిత్వ శాఖలు డిజిటల్ వేదికల్లో పనిచేయడం ప్రారంభించాయి. దాదాపు 57 శాఖలు 80 శాతం పనిని ఈ-ఆఫీస్‌లోనే చేస్తుండటం విశేషం. ఈ విధానాన్ని కొనసాగించేందుకు సెక్షన్ అధికారి స్థాయి వ్యక్తులకు వీపీఎన్ యాక్సెస్ ఇవ్వాలని డీవోపీటీ ప్రతిపాదించింది.

Also Read;వలస కూలీలకు ఉపాధి పనులు, వన్ నేషన్ వన్ రేషన్ కార్డు: నిర్మలా సీతారామన్

ప్రస్తుతానికి ఈ అధికారం డిప్యూటీ సెక్రటరీ, ఆపై స్థాయి అధికారులకు మాత్రమే  ఉంది. ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేందుకు ప్రభుత్వం లాప్‌టాప్‌లను ఇవ్వనుందని సమాచారం. పార్లమెంట్ సంబంధిత, వీఐపీ ప్రశ్నలు దస్త్రాలను ప్రాసెస్ చేసేవారికి ఎస్ఎంఎస్ వ్యవస్ధను తీసుకురావాలని డీవోపీటీ తెలిపింది.

సమావేశాల కోసం ఎన్ఐసీ వేదికలను వీడియో కాన్ఫరెన్స్‌ల కోసం ఉపయోగించుకోవాలని తెలిపింది. ఇంటి నుంచి పనిచేసే అధికారులు ఫోన్‌లో అందుబాటులో ఉంటారు. వారి కంప్యూటర్, ఇతర ఎల్‌క్ట్రానిక్ పరికరాలను మాల్‌వేర్ల నుంచి రక్షించే బాధ్యత ఎన్ఐసీ తీసుకుంటుందని సిబ్బంది వ్యవహారాల శాఖ సదరు ముసాయిదాలో పేర్కొంది. 
 

click me!