30 శాతం వేతనం తగ్గించుకుని... ఇతర పొదుపు చర్యలు: రాష్ట్రపతి నిర్ణయం

By Siva KodatiFirst Published May 14, 2020, 7:00 PM IST
Highlights

కరోనా వైరస్‌పై భారతదేశం పోరాడుతుండటం, లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోతున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు

కరోనా వైరస్‌పై భారతదేశం పోరాడుతుండటం, లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోతున్న నేపథ్యంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వేతనాన్ని ఏడాది పాటు 30 శాతం తగ్గించుకున్నారు.

దీనితో పాటు పొదుపు చర్యలు పాటించడం, భౌతిక దూరం పాటించడంలో భాగంగా దేశీయ పర్యటనలు, కార్యక్రమాలను తగ్గించుకోవాలని రాష్ట్రపతి నిర్ణయించినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది.

Also Read:ప్రభుత్వోద్యోగులకు శుభవార్త: ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

ఎట్‌హోం, ఇతర విందుల్లో అతిథుల సంఖ్యను, మెనూను తగ్గించాలని నిర్ణయించారు. రాష్ట్రపతి భవన్‌ను అలంకరించడాన్ని కూడా పరిమితంగా చేయనున్నారు. ప్రత్యేక సందర్భాల్లో వినియోగించే లిమోసైన్ (కారు) కొనుగోలును కూడా వాయిదా వేశారు.

రాష్ట్రపతి భవన్‌లో అవసరాల మేరకే మరమ్మత్తులు, నిర్వహణ కార్యక్రమాలు, కాగితం వినియోగం తగ్గించి కార్యాలయాన్ని పర్యావరణ హితంగా మార్చనున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలిపింది.

Also Read:ప్రభుత్వోద్యోగులకు శుభవార్త: ఏడాదికి 15 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్

అలాగే ఇంధనం, విద్యుత్ వినియోగం విషయంలో పొదుపు పాటించాలని రామ్‌నాథ్ కోవింద్ ఆదేశించారు. ఈ పొదుపు చర్యల వల్ల రాష్ట్రపతి భవన్‌ బడ్జెట్‌లో సుమారు 20 శాతం ఆదా అవుతుందని అంచనా.

ఆ మొత్తాన్ని కోవిడ్ 19పై పోరుకు వినియోగించాలని రాష్ట్రపతి సూచించారు. కాగా ఇప్పటికే పీఎం కేర్స్‌కు రామ్‌నాథ్ కోవింద్ తన మార్చి నెల వేతనాన్ని విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. 

click me!