పునరుత్పాదక రంగంలో భారత్ సామర్థ్యం గోల్డ్ మైన్ కంటే తక్కువేమీ కాదు - ప్రధాని నరేంద్ర మోడీ

Published : Feb 23, 2023, 01:15 PM IST
పునరుత్పాదక రంగంలో భారత్ సామర్థ్యం గోల్డ్ మైన్ కంటే తక్కువేమీ కాదు - ప్రధాని నరేంద్ర మోడీ

సారాంశం

గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ప్రభుత్వం జీవ ఇంధనంపై ఎక్కువ దృష్టి పెట్టిందని, పెట్టుబడిదారులకు ఇది అనేక అవకాశాలను తెస్తుందని చెప్పారు. 

పునరుత్పాదక ఇంధన రంగంలో దేశ సామర్థ్యం గోల్డ్ మైన్ కంటే తక్కువేమీ కాదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. గ్రీన్ గ్రోత్‌పై యూనియన్ బడ్జెట్ 2023-24లో చేసిన వివిధ ప్రకటనలపై ఒక వెబ్‌నార్‌లో మోడీ ప్రసంగించారు. ‘‘గ్రీన్ ఎనర్జీలో భారతదేశం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నేను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వాటాదారులను ఆహ్వానిస్తున్నాను’’ అని అన్నారు.

నేను కూడా బీఫ్ తింటా.. రాష్ట్రంలో గొడ్డు మాంసంపై ఆంక్షలేమీ లేవు: మేఘాలయ బీజేపీ చీఫ్ సంచలన ప్రకటన

భారత్ లో సోలార్, విండ్ ఎనర్జీ, బయోగ్యాస్ వంటి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం బంగారు గని కంటే తక్కువేమీ కాదని అన్నారు. ప్రభుత్వం జీవ ఇంధనంపై ఎక్కువ దృష్టి పెట్టిందని, పెట్టుబడిదారులకు ఇది చాలా అవకాశాలను తెస్తుందని ప్రధాని పేర్కొన్నారు. షెడ్యూల్ కంటే ఐదు నెలల ముందుగానే 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని భారత్ సాధించడాన్ని ఆయన ప్రస్తావించారు. షెడ్యూల్ కంటే తొమ్మిదేళ్ల ముందుగానే 40 శాతం నాన్-ఫాసిల్ ఇంధన సామర్థ్యం లక్ష్యాన్ని చేరుకోవడంపై కూడా ప్రధాని మోడీ మాట్లాడారు. 

సీఎం అవ్వాలని తొందరేమీ లేదు.. బీజేపీని గద్దె దించడమే ప్రధాన లక్ష్యం - బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్

2014 నుంచి వచ్చిన బడ్జెట్లు ప్రస్తుత సవాళ్లను పరిష్కరించడమే కాకుండా నవతరం సంస్కరణలకు ఊతమిచ్చాయన్నారు. నేషనల్ హైడ్రోజన్ మిషన్ కింద ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ప్రైవేటు రంగానికి రూ.19,000 కోట్ల ప్రోత్సాహకాన్ని అందించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం: అరవింద్ కేజ్రీవాల్ పీఏకు ఈడీ నోటీసులు

వాహనాల స్క్రాపింగ్ కోసం బడ్జెట్ లో రూ.3,000 కోట్లు కేటాయించారని, 15 ఏళ్లకు పైబడిన 3 లక్షల ప్రభుత్వ వాహనాలను స్క్రాప్ చేస్తామని ప్రధాని చెప్పారు. భారత్ బ్యాటరీ నిల్వ సామర్థ్యాన్ని గంటకు 125 గిగావాట్లకు పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని కలిగి ఉండాలని భారతదేశం ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?