ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు: కేరళలోనే అధికంగా కేసులు

By narsimha lodeFirst Published Oct 7, 2021, 10:05 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసుల నమోదు మళ్లీ పెరిగింది. గత 24 గంటల్లో 22,431 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే 19 శాతం కేసుల నమోదు అధికంగా ఉందని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 4,49,856కి చేరుకొందని వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. రెండు మూడు రోజులుగా 20 వేలకు దిగువన నమోదైన corona cases మళ్లీ 20 వేలకు పైగా నమోదయ్యాయి.గత 24 గంటల్లో Indiaలో 22,431 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 18,833 వేల  కరోనా కేసులు రికార్డయ్యాయి.మంగళవారం  నాటితో పోలిస్తే బుధవారం నాడు దేశంలో 19 శాతం కరోనా కేసులు పెరిగాయి.318 మంది కరోనాతో మరణించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

also read:24 గంటల్లో 187 కొత్త కరోనా కేసులు.. తెలంగాణలో 6,67,158కి చేరిన సంఖ్య

తాజాగా నమోదైన కరోనా కేసులతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 3,38,94,312కి చేరింది. కరోనాతో మరణించిన రోగుల సంఖ్య 4,49,856కి చేరుకొందని ఐసీఎంఆర్ తెలిపింది.ఇండియాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2.44 లక్షలకు చేరుకొంది.

ఇండియాలో 30 వేలకు దిగువన కరోనా కేసులు  13 రోజులుగా నమోదౌతున్నాయని ICMR ప్రకటించింది. కరోనా రోగుల రికవరీ శాతం 97.95 శాతంగా నమోదైంది.కరోనా పాజిటివిటీ రేటు 1.57 శాతంగా నమోదైందని కేంద్రం తెలిపింది.

దేశంలో నమోదౌతున్న కేసుల్లో కేరళ రాష్ట్రంలో నమోదౌతున్న  కేసులే అత్యధికంగా ఉన్నాయి. కేరళలో 12,616 కరోనా కేసులు రికార్డయ్యాయి.

click me!