పాము కాటుతో చంపేయడం ట్రెండ్ అయిపోయింది.. సుప్రీం కోర్టు సీరియస్..!

By telugu news teamFirst Published Oct 7, 2021, 9:52 AM IST
Highlights

నిందితుడు కృష్ణ కుమార్ తరఫున హాజరైన అడ్వకేట్ ఆదిత్య చౌదరి, "నిందితులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆధారాలు లేవు" అని అన్నారు.
 

కొంత కాలం క్రితం  ఓ వ్యక్తి  మహిళను పథకం ప్రకారం చంపేశాడు. అయితే.. దానిని సహజ మరణంలా నమ్మించే ప్రయత్నం చేశాడు. పాముతో కరిపించి హత్య చేశాడు. కాగా.. నిందితుడు తాజాగా తనకు బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. కాగా.. ఈ ఘటనపై సుప్రీం కోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.

పాముతో చంపేసి.. తెలివిగా.. సహజ మరణంలా నమ్మించేలా చేస్తున్నారని కోర్టు మండిపడింది.  ఇలా పాముతో చంపేయడం రాజస్థాన్ లో ట్రెండ్ గా మారింది అంటూ న్యాయస్థానం మండిపడింది. విచారణ సమయంలో, జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. పాములు పట్టేవారి దగ్గరి నుంచి విషపూరిత పాములను తీసుకువచ్చి.. చంపేయడం రాజస్థాన్ లో ట్రెండ్ గా మారిందంటూ ఆయన ఆరోపించారు.

నిందితుడు కృష్ణ కుమార్ తరఫున హాజరైన అడ్వకేట్ ఆదిత్య చౌదరి, "నిందితులకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆధారాలు లేవు" అని అన్నారు.

కృష్ణ కుమార్ ప్రధాన నిందితుడితో పాములు పట్టే వ్యక్తి దగ్గరకు వెళ్లి 10,000 కి పామును కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మిస్టర్ చౌదరి తన క్లయింట్ తన స్నేహితుడు పాములను లేదా విషాన్ని ఎందుకు కొంటున్నారో తెలియదని వాదించాడు. భార్యను చంపడానికి కాదని.. ఔషధం కోసం పామును కొన్నాడని కవర్ చేయడం గమనార్హం. శ్రీ కుమార్ పాముతో మహిళ ఇంటికి కూడా వెళ్లలేదని న్యాయవాది వాదించారు. నిందితుడు ఇంజనీరింగ్ విద్యార్థి అని, అతని భవిష్యత్తు దృష్ట్యా అతనికి బెయిల్ ఇవ్వాల్సి ఉందని ఆయన అన్నారు.

ఈ సంఘటన 2019 లో రాజస్థాన్‌లోని యువాన్ జిల్లాలో  చోటుచేసుకుంది. ఆ జిల్లాలోని ఒక గ్రామంలో పాము కాటుకు గురై ఒక మహిళను తన కోడలుతో చంపేసి వార్తల్లో నిలిచింది. కోడలు అల్పనకు జైపూర్ నివాసి మనీష్‌తో వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి.

అల్పన , ఆమె అత్తగారు సుబోధ్ దేవి కలిసి జీవించేవారు  అల్పన భర్త , బావమరిది సైన్యంలో ఉన్నారు . వారి వృత్తి కారణంగా దూరంగా నివసించేవారు.

సుబోధ్ దేవి భర్త రాజేష్ కూడా ఉద్యోగం కారణంగా ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమలో అల్పనకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో అత్తగారు అడ్డుగా ఉన్నారని.. ఆమెను పాముతో కరిపించి చంపినట్లు కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలో నిందితుడికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తూ.. పై విధంగా కామెంట్స్ చేసింది.

click me!