
ఆకాశంలో అద్భుతం జరిగింది. ఓ బుడతడు ఎగురుతున్న విమానంలో ఎంచక్కా తల్లిగర్భంలోంచి ‘గాల్లో పడ్డాడు’. నెలలు నిండక ముందే ఆ బుడతడికి తొందర ఎక్కువయ్యింది. అందుకే విమానంలో ఇండియాకు వస్తుంటే మార్గ మద్యలోనే మారాం చేశాడు. తల్లితో పాటు.. తోటి ప్రయాణికులు కూడా ఆ బుడతడి తొందరను అర్థం చేసుకున్నారు. కాసేపు టెన్షన్ పడ్డా.. చివరికి విమానంలోని డాక్టర్లు, నర్సులు ఆ బుడతడిని బాహ్యప్రపంచంలోకి తీసుకువచ్చారు. ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెడితే...
లండన్ నుంచి కోచి బయలు దేరిన Air India Flight ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉత్కంఠభరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు Labor pains మొదలుకావడమే ఇందుకు కారణం. విమానంలో 204మంది ప్రయాణిస్తున్నారు. ముందుగా ఈ విషయం గమనించిన తోటి ప్రయాణికులు కంగారు పడ్డారు. విషయాన్ని వెంటనే విమానంలోని స్టాఫ్ కి వివరించారు.
లఖింపూర్ ఖేరీ హింస: సుప్రీం సీరియస్.. సుమోటోగా స్వీకరణ, రేపు విచారించనున్న సీజేఐ బెంచ్
వారు ప్రయాణికుల్లో గమనించగా.. వారిలో ఇద్దరు వైద్యులు, నలుగురు నర్సులు ఉన్నారని తేలింది. వారి టెన్షన్ రిలీవ్ అయ్యింది. ఈ doctors వెంటనే ఆ మహిళకు వైద్యం మొదలుపెట్టారు. నెలలు నిండని ప్రసవం కావడంతో.. కొంచెం రిస్క్ చేశారు. చివరికి delivery సుఖాంతమై.. క్యార్ క్యార్ అనే బాబు కేకలతో ‘హమ్మయ్య’ అని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆమెకు వైద్యం పర్యవేక్షణ అవసరం కావడంతో మార్గమద్యలో జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ లో అత్యవసరంగా విమానాన్ని దించి, తల్లీబిడ్డలను ఆస్పత్రికి తరలించారు. మరో ప్యాసింజర్ వీరికి తోడుగా ఉన్నారు. మిగతా ప్రయాణికులతో విమానం తిరిగి కోచికి బయలుదేరింది. మంగళవారం ఈ సంఘటన జరిగింది. ఆ ముగ్గురినీ తర్వాత ఫ్రాంక్ ఫర్ట్ నుంచి భారత్ కు తీసుకువస్తామని ఎయిరిండియా అధికార ప్రతినిధి తెలిపారు.