ఇండియాలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కానీ కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా అదుపులోకి రావడం లేదు.నిన్న ఒక్క రోజే దేశంలోని 11.41 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 18,346 మందికి కరోనా సోకిందని తేలింది. గత 209 రోజుల్లో ఇంత తక్కుంగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
న్యూఢిల్లీ: ఇండియాలో(india) గత 24 గంటల్లో 18,346 కరోనా(corona cases) కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల (corona active cases)సంఖ్య 2,52,902కి చేరింది.నిన్న ఒక్క రోజే దేశంలోని 11.41 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే 18,346 మందికి కరోనా సోకిందని తేలింది. గత 209 రోజుల్లో ఇంత తక్కుంగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
also read:ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం 20,53,192కి చేరిక
అయితే కరోనాతో మరణించిన రోగుల సంఖ్య నిన్న ఒక్క రోజే 263గా నమోదైంది. అంకు ముందు రోజు కంటే నిన్న కరోనాతో రోగులు అధికంగా మృతి చెందడం ఆందోళన కల్గిస్తోంది.దేశంలో నమోదౌతున్న కరోనా కేసుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదౌతున్నాయి. నిన్న మరణించిన కరోనా రోగుల్లో అత్యధికంగా కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి.కేరళలో నిన్న ఒక్క రోజే 8,850 కరోనా కేసులు రికార్డయ్యాయి. కరోనాతో 149 మంది మరణించారు.
దేశంలో నిన్న ఒక్క రోజే కరోనా నుండి 29,639 మంది కోలుకొన్నారు. ఇప్పటివరకు కరోనా నుండి 33,31,50,886 కోట్ల మంది రికవరీ అయ్యారు. కరోనా రోగుల రికవరీ రేటు 97.93 శాతానికి చేరింది.దేశ వ్యాప్తంగా 57,53,94,042 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నారని ఐసీఎంఆర్ తెలిపింది.