ప్రేమపేరుతో మైనర్ ను లైంగికంగా వాడుకుని, వీడియోలు తీసి.. తీరా పెళ్లి చేసకోమంటే...

Published : Oct 05, 2021, 09:20 AM IST
ప్రేమపేరుతో మైనర్ ను లైంగికంగా వాడుకుని, వీడియోలు తీసి.. తీరా పెళ్లి చేసకోమంటే...

సారాంశం

ఢిల్లీలోని మైదాన్ గఢీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల సుప్రియ(పేరు మార్చబడింది)కు అదే ప్రాంతంలో నివసించే కపిల్ అనే యువకుడితో పరిచయం అయ్యింది. కపిల్ ఆ ప్రాంతంలో ఒక మొబైల్ షాప్ లో పని చేసేవాడు. సుప్రియ ఆ మొబైల్ షాప్ కు తరచుగా రావడంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.  

ఢిల్లీ : ఓ మైనర్ బాలికకు(minor girl) ఓ యువకుడితో పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా(Love Affair) మారింది.  ఆ యువకుడు మైనర్ ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. తన కోరిక తీర్చాలంటూ (Sexual Favors) ఒత్తిడి చేశాడు. చివరకు మాయమాటలతో ఆమెను లొంగదీసుకున్నాడు. అదే కంటిన్యూ చేశాడు. చివరికి మైనర్ పెళ్లి చేసుకోవాలని కోరడంతో అసలు రంగు బైట పెట్టాడు. 

ఢిల్లీలోని మైదాన్ గఢీ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల సుప్రియ(పేరు మార్చబడింది)కు అదే ప్రాంతంలో నివసించే కపిల్ అనే యువకుడితో పరిచయం అయ్యింది. కపిల్ ఆ ప్రాంతంలో ఒక మొబైల్ షాప్ లో పని చేసేవాడు. సుప్రియ ఆ మొబైల్ షాప్ కు తరచుగా రావడంతో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. తర్వాత వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది.  

సుప్రియను పెళ్లి చేసుకుంటానని చెప్పి కపిల్ ఆమెను లొంగదీసుకున్నాడు. ఆ తరువాత తరచుగా ఆమెను లైంగికంగా వాడుకునేవాడు. ఇలా కొద్దిరోజులు గడిచాకా.. ఒకరోజు సుప్రియ ఇక తన వల్ల కాదు పెళ్లి చేసుకుంటావా? లేదా? అని అతడిని నిలదీసింది.  దీంతో అసలు రూపం బయటకు వచ్చింది.  పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని,  కానీ తనతో సెక్స్ చేయకపోతే సుప్రియ జీవితం నాశనం చేస్తానని బెదిరించాడు.  

దూరంగా వెళ్లి మూత్రం పోయాలన్నందుకు కత్తితో పొడిచి.. దారుణ హత్య.. !

సుప్రియ అతని మాటలు వినేది లేదని చెప్పేసరికి, కపిల్ తన వద్ద ఉన్న ఒక వీడియో చూపించాడు. అందులో వారిద్దరూ సెక్స్ చేస్తున్నట్టు రికార్డ్ అయి ఉంది. ఇది చూసిన సుప్రియ కంగారు పడింది.  తాను చెప్పింది వినకపోతే ఆ వీడియో ఇంటర్నెట్లో పెడతామని కపిల్ బ్లాక్మెయిల్ చేశాడు.  దీంతో అతను చెప్పిన మాటలకు సుప్రియ  తలవంచింది.  

కానీ కొన్ని రోజుల తర్వాత ఇక భరించలేకపోయింది. తనవల్ల కాదని.. ఏమైతే అది అయ్యిందని కపిల్ చేసిన దుర్మార్గం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  సుప్రియ మైనర్ కావడంతో పోలీసులు కపిల్‌పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.  ప్రస్తుతం కపిల్ పరారీలో ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Viral News : ఇక జియో ఎయిర్ లైన్స్.. వన్ ఇయర్ ఫ్రీ..?
Viral News: పెరుగుతోన్న విడాకులు.. ఇకపై పెళ్లిళ్లు చేయకూడదని పండితుల నిర్ణయం