దూరంగా వెళ్లి మూత్రం పోయాలన్నందుకు కత్తితో పొడిచి.. దారుణ హత్య.. !

Published : Oct 05, 2021, 08:58 AM IST
దూరంగా వెళ్లి మూత్రం పోయాలన్నందుకు కత్తితో పొడిచి.. దారుణ హత్య.. !

సారాంశం

ఆ వ్యక్తి వారిద్దరి కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా మూత్ర విసర్జన చేయడం మొదలుపెట్టాడు. దీంతో కాస్త దూరంగా వెళ్లి మూత్ర విసర్జన చేయాలని అన్సారీ చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది.  

ముంబై : క్షణికావేశంలో చిన్న చిన్న కారణాలకే హత్యలకు (Murder)పాల్పడడం, ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు నేరం అంటే భయం ఉండేది. కానీ నేడు నేరం చేయడం, నిందితుడిగా మారడం, జైలుకు వెళ్లి రావడం మామూలుగా మారిపోయింది. 

అలాంటి ఘటనే ముంబైలో ఇటీవల చోటు చేసుకుంది. ఇటీవల జరుగుతున్న పలు ఘటనలు చూస్తుంటే క్షణికావేశంలో చిన్నచిన్న గొడవలకు కూడా కొందరు హత్యలకు పాల్పడుతున్నారు.  ఓ వ్యక్తి తనకు కాస్త దూరంగా  వెళ్లి మూత్రం పోయమని చెప్పిన వ్యక్తిని హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.  

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  మహ్మద్ రఫీక్ అన్సారీ (41)  తన స్నేహితుడితో కూర్చుని మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో నిందితుడు  మహమ్మద్ అబ్దుల్లా ఆలం షేక్ (24) ఆ ప్రాంతానికి వచ్చాడు.

ఢిల్లీలో దారుణం : ఆటో ఎక్కిన యువతిపై గ్యాంగ్ రేప్..! డ్రైవర్ అరెస్ట్ !!

ఆ వ్యక్తి వారిద్దరి కూర్చున్న ప్రదేశానికి దగ్గరగా మూత్ర విసర్జన చేయడం మొదలుపెట్టాడు. దీంతో కాస్త దూరంగా వెళ్లి మూత్ర విసర్జన చేయాలని అన్సారీ చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం నెలకొంది.  అలా చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారిన నేపథ్యంలో ఆగ్రహంతో షేక్ కత్తితో అన్సారీని దారుణంగా పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ హాఠాత్ పరిణామానికి అన్సారీ స్నేహితుడు షాక్ కు గురయ్యాడు. వెంటనే ఘటనలో తీవ్రంగా గాయపడిన అన్సారీని ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  హత్య చేసిన నిందితుడు షేక్‌ను వదలా ట్రక్ టెర్మినల్ స్టేషన్‌ పోలీసులు అరెస్టు చేశారు.

PREV
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu