100 కోట్ల కరోనా వ్యాక్సిన్ మైలురాయిని చేరుకొని కొత్త చరిత్రను సృష్టించామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. శుక్రవారం నాడు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రసంగించారు.
న్యూఢిల్లీ: వంద కోట్ల కరోనా వ్యాక్సిన్ మైలు రాయిని అధిగమించడం భారత ప్రజల విజయమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.ఈ ఏడాది అక్టోబర్ 21 నాటి దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్టుగా మోడీ చెప్పారు. వంద కోట్ల వ్యాక్సిన్ మైలురాయిని దాటి చరిత్ర సృష్టించామన్నారు.
also read:ఆ రోజు కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే...బహుమతులు గెలుచుకోవచ్చు..!
undefined
శుక్రవారం నాడు ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి Narendra Modi ప్రసంగించారు. భారత్ సాధించిన విజయాన్ని ప్రపంచ చేశాలు కొనియాడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ మనవైపే చూస్తున్నాయన్నారు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని మోడీ తెలిపారు. సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా వ్యాక్సిన్ మన నివాదం అని ఆయన చెప్పారు. అన్ని వర్గాల వారికి వ్యాక్సిన్ అందించినట్టుగా ఆయన వివరించారు. దేశ ప్రజల కర్తవ్య దీక్ష వల్లే ఈ విజయం సాధ్యమైందని మోడీ అభిప్రాయపడ్డారు.
ఇంత పెద్ద దేశానికి టీకాల సరఫరా అనేది పెద్ద సవాల్. అయితే ఈ సవాల్ ను అధిగమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. మన దేశం ఎంత సంకల్పబద్దంగా ఉంటుందో కరోనా వ్యాక్సిన్ లో 100 కోట్ల మైలురాయిని అధిగమించడమే నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. అతి తక్కువ సమయంలో 100 కోట్ల వ్యాక్సిన్ లు ఇచ్చి చరిత్ర సృష్టించామని మోడీ చెప్పారు.భారత ఫార్మారంగం శక్తి మరోసారి ప్రపంచానికి తెలిసిందని మోడీ అభిప్రాయపడ్డారు.
పెద్ద పెద్ద దేశాల్లో కూడ కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ నత్తనడకన సాగుతుందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. పెద్ద పెద్ద దేశాల్లో కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదన్నారు మోడీ.పండుగ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలని ఆయన ప్రజలను కోరారు. కరోనా ప్రోటోకాల్స్ ను పాటించాలని కోరారు. ప్రతి ఒక్కరూ కూడ వ్యాక్సిన్ వేసుకోవాలని మోడీ కోరారు. కరోనా మహమ్మారి ముప్పు తొలగిపోలేదని ఆయన చెప్పారు.మాస్క్ ధరించడం మానేయవద్దని మోడీ ప్రజలకు సూచించారు.
ఇండియాలో Corona Vaccine పంపిణీ ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైంది. వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన 279 రోజుల్లోనే 100 కోట్ల మైలు రాయిని వ్యాక్సిన్ దాటింది. దేశంలో ప్రతి రోజూ 35,84,223 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్టుగా Icmr రికార్డులు చెబుతున్నాయి.దేశంలో ఇప్పటివరకు 70 శాతం మందికి ఒక్కడోసు, 31 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తైంది.