టర్కీపై భారత్ ఆంక్షలు .. అధికారిక సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్

Published : May 14, 2025, 01:30 PM IST
టర్కీపై భారత్ ఆంక్షలు .. అధికారిక సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్

సారాంశం

ఇటీవల ఉద్రిక్తతల సమయంలో పాకిస్థాన్ కు సహకరించిన దేశాలపై ఇండియా చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే పాకిస్థాన్, చైనా కు చెందిన సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసిన భారత్ తాజాగా మరోదేశంపై అలాంటి చర్యలే తీసుకుంది.      

India Pakistan : చైనా ప్రభుత్వ మీడియా సంస్థలైన గ్లోబల్ టైమ్స్, జిన్హువా న్యూస్ ఏజెన్సీల ఎక్స్ ఖాతాలను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా టర్కిష్ ప్రభుత్వ మీడియా సంస్థ టీఆర్టి వరల్డ్ ఎక్స్ ఖాతాను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. భారత్ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నందున ఈ చర్య తీసుకున్నట్లు భారత్ తెలిసింది.

భారత ఎలక్ట్రానిక్స్ ఆండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు ఈ విషయంపై ఇమెయిల్ పంపినప్పటికీ టర్కిష్ మీడియా సంస్థ నుండి స్పందన రాలేదు. భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాలకు చైనా పేర్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబెట్ అని చైనా దావా వేస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రదేశాలకు చైనా పేర్లు పెట్టడాన్ని భారత్ బుధవారం తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగమని, ఎల్లప్పుడూ అలాగే ఉంటుందని స్పష్టం చేసింది.

"అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రదేశాలకు చైనా పేర్లు పెట్టే ప్రయత్నాలను మేము గమనించాము" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రంధీర్ జైస్వాల్ అన్నారు. "మా సూత్రప్రాయమైన వైఖరికి అనుగుణంగా, మేము అటువంటి ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నాము" అని ఆయన అన్నారు.

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !