
ఆగస్టు 15 భారతదేశ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన రోజు. 190 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన అనంతరం 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సాధించింది. ఈ రోజు దేశవ్యాప్తంగా ఉత్సాహంగా, దేశభక్తితో వేడుకలు జరుపుకుంటారు.
ప్రతి సంవత్సరం న్యూఢిల్లీ ఎర్రకోట వద్ద ప్రధాన మంత్రి జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సంప్రదాయాన్ని దేశపు తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ ప్రారంభించారు. 2025లో కూడా ఈ వేడుకలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేయనున్నారు.
ప్రతి సంవత్సరం రక్షణ మంత్రిత్వ శాఖ, MyGov ప్లాట్‌ఫారమ్‌తో కలిసి స్వాతంత్ర దినోత్సవ థీమ్‌ను ప్రకటిస్తుంది. ఈ ఏడాది థీమ్ – ‘స్వేచ్ఛను గౌరవిద్దాం, భవిష్యత్తుకు ప్రేరణ ఇస్తాం’. ఇది త్యాగాలను స్మరించడంతో పాటు కొత్త తరాలకు ఉత్సాహాన్ని నింపేలా ఉంటుంది.
పహల్గామ్‌లో తీవ్రవాదుల దాడులు, ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించడం వంటి నేపథ్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి స్పష్టమైన సందేశం ఇవ్వనున్నారని తెలుస్తోంది.
“పీడకుడు స్వేచ్ఛను స్వయంగా ఇవ్వడు; పీడితులు దానిని డిమాండ్ చేయాలి.”
“తప్పు చేసే స్వేచ్ఛ లేకపోతే ఆ స్వేచ్ఛకు విలువ లేదు.”
“జీవితాంతం ఖైదీగా ఉండే కంటే, స్వేచ్ఛ కోసం పోరాడుతూ మరణించడం మేలు.”
“ఎంత బలంగా వినియోగించినా క్రూరశక్తి మనిషి స్వేచ్ఛా ప్రవృత్తిని అణిచివేయదు.”
“స్వేచ్ఛకు సహజప్రవృత్తి ఉందని నమ్మితే, మార్పు సాధించే అవకాశాలు ఉంటాయి. మెరుగైన ప్రపంచం నిర్మించడానికి మీరు సహకరించే అవకాశం కూడా ఉంటుంది.”