గుడ్‌న్యూస్: కరోనాకు కొత్త మందు, 2 డీజీ మందును కనిపెట్టిన డీఆర్‌డీఓ

By narsimha lodeFirst Published May 9, 2021, 1:10 PM IST
Highlights

కరోనాకు డీఆర్‌డీఓ కొత్త మందును  కనిపెట్టింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి డీఆర్‌డీఓ ఈ మందును కనిపెట్టింది. ఈ డ్రగ్ ను అత్యవసర వినియోగం కోసం  డీసీజీఐ శనివారం నాడు అనుమతిని ఇచ్చింది. 
 

హైదరాబాద్: కరోనాకు డీఆర్‌డీఓ కొత్త మందును  కనిపెట్టింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ తో కలిసి డీఆర్‌డీఓ ఈ మందును కనిపెట్టింది. ఈ డ్రగ్ ను అత్యవసర వినియోగం కోసం  డీసీజీఐ శనివారం నాడు అనుమతిని ఇచ్చింది. దీనికి గాను 2 డీ ఆక్సి-డి గ్లూకోజ్ (2డీజీ) గా పేరు పెట్టారు. ఈ మందు పొడి రూపంలో లభ్యం కానుంది. నీటిలో కరిగించి ఈ మందును ఉపయోగించనున్నారు.  తక్కువ నుండి తీవ్రమైన లక్షణాలున్న పేషేంట్లకు ఈ మందు విజయవంతంగా పనిచేస్తోందని ప్రయోగాల్లో తేలిందని డీఆర్‌డీఓ ఛైర్మెన్ సతీష్ రెడ్డి చెప్పారు. 

వైరస్ వ్యాప్తిని  ఈ మందు తగ్గించే అవకాశం ఉందని డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. సాధారణ రోగులతో పోలిస్తే ఈ డ్రగ్ తీసుకొన్న రోగులు రెండున్నర రోజుల ముందే కోలుకొన్నట్టుగా ప్రయోగాల్లో తేలింది. రెండు విడతలుగా ఈ మందు ప్రయోగాలు నిర్వహించారు.ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయని కూడ డీఆర్‌డీఓ వర్గాలు తెలిపాయి. 


 

click me!