ఆర్థిక నేరగాళ్లకు అధికారుల అండ .. పాస్‌పోర్ట్ క్యాన్సిలైనా నాలుగు దేశాలు తిరిగాడు..

First Published Jun 15, 2018, 12:06 PM IST
Highlights

ఆర్థిక నేరగాళ్లకు అధికారుల అండ .. పాస్‌పోర్ట్ క్యాన్సిలైనా నాలుగు దేశాలు తిరిగాడు..

భారత్‌లోని అత్యున్నత అధికారుల పనితీరు ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు. దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.13 వేల కోట్లు టోకరా వేసి విదేశాలకు పారిపోయాడు ఆభరణాల వ్యాపారి నీరవ్ మోడీ. ఈ విషయం వెలుగు చూసిన వెంటనే అతను దేశం విడిచి వెళ్లకుండా కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ అతని పాస్‌పోర్ట్‌ను రద్దు చేసింది. అయినప్పటికీ.. ఆ రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించే నీరవ్ మోడీ నాలుగు సార్లు మూడు దేశాలకు వెళ్లినట్లు సీబీఐ గుర్తించింది.

ఫిబ్రవరి 24న నీరవ్ మోడీ, ఆయన మామ మెహుల్ చోక్సీ పాస్‌పోర్టులను భారత ప్రభుత్వం రద్దు చేసింది.  అదే పాస్‌పోర్టు మీద మార్చి 15-31 మధ్య అమెరికా, బ్రిటన్, హాంగాంగ్‌ల మధ్య నీరద్ ప్రయాణించినట్లు ఇంటర్‌పోల్ అధికారులు సీబీఐకి  తెలిపారు. దీనిని బట్టి ఆర్థిక నేరగాళ్లకు అత్యున్నత ప్రభుత్వ వర్గాలు ఏ స్థాయిలో కొమ్ముకాస్తున్నాయో తెలుస్తోంది. ప్రస్తుతం నీరవ్‌కు సహకరించిన ఆ అధికారుల జాబితాను తయారు చేసే పనిలో సీబీఐ నిమగ్నమైంది.

click me!