సోనాలీ ఫోగాట్ మృతి కేసు: మరణానికి ముందు బలవంతంగా డ్రగ్స్.. బాంబు పేల్చిన గోవా పోలీసులు

By Siva KodatiFirst Published Aug 26, 2022, 6:17 PM IST
Highlights

బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ మృతి కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ నేపథ్యంలో నిందితులు సోనాలీకి బలవంతంగా డ్రింక్స్ ద్వారా అబ్ నాక్సియస్ కెమికల్ ఇచ్చారని గోవా పోలీసులు చెబుతున్నారు. 

టిక్‌టాక్ స్టార్, హర్యానా బీజేపీ నేత సోనాలీ ఫోగాట్ అనుమానాస్పద మృతి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తొలుత గుండెపోటుతో ఆమె మరణించినట్లు పోలీసులు భావించగా.. సోనాలీ సోదరి అనుమానాలు, పోస్ట్‌మార్టం రిపోర్ట్ తర్వాత దీనిని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు పోలీసులు. తాజాగా ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. సోనాలీ ఫోగాట్ డ్రగ్స్ తీసుకున్నారని .. దీని వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారని పోలీసులు చెబుతున్నారు. నిందితులు సోనాలీకి బలవంతంగా డ్రింక్స్ ద్వారా అబ్ నాక్సియస్ కెమికల్ ఇచ్చారని గోవా పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ హత్య వెనుక ఆర్ధిక పరమైన కారణాలు వుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

గోవా ఇన్స్‌పెక్టర్ జనరల్ ఓంవీర్ సింగ్ బిష్ణోయ్ మీడియాతో మాట్లాడుతూ.. అనుమానితుల్లో ఒకరు సోనాలీకి బలవంతంగా ఏదో పదార్ధాన్ని ఇచ్చినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమె తనపై తాను నియంత్రణ కోల్పోయారని బిష్ణోయ్ పేర్కొన్నారు. తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో సోనాలీ స్పృహలో లేనప్పుడు అనుమానితుడు ఆమెను బాత్‌రూమ్‌కి తీసుకెళ్లాడని, దాదాపు రెండు గంటల పాటు ఏం జరిగిందో తెలియాల్సి వుంది. 

ALso REad:బీజేపీ నేత సోనాలీ ఫోగట్‌ను హత్య చేశారు.. పోలీసులకు సోదరుడి ఫిర్యాదు

ఇకపోతే... సోనాలీ ఫోగాట్ మృతదేహంపై గాయాలు వున్నాయని పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడి కావడంతో ఆమె హత్య కేసులో ప్రమేయం వుందన్న అనుమానంతో సోనాలీ సహాయకులైన ఇద్దరిని గోవా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిద్దరూ సుధీర్ సగ్వాన్, సుఖ్వీందర్ వాసి. ఇదిలావుండగా.. సోనాలీ ఫోగాట్ సోదరుడు రింకూ ధాకా పోలీసులకు చేసిన ఫిర్యాదులో వీరిద్దరి పేర్లను పేర్కొన్నాడు. ఆగస్ట్ 22న సోనాలీ గోవాకు వచ్చినప్పుడు సగ్వాన్, వాసీలు ఆమెతో పాటే వున్నారు. 

టిక్‌టాక్ వీడియోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనాలీ ఫోగాట్‌ను ఆగస్ట్ 23న ఉదయం నార్త్ గోవా జిల్లాలోని అంజునాలోని సెయింట్ ఆంథోనీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆమె గుండెపోటుతో అప్పటికే మరణించినట్లుగా వైద్యులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. గోవా డీజీపీ జస్పాల్ సింగ్‌ జాతీయ వార్తా సంస్థ ఇండియా టుడేతో మాట్లాడుతూ.. ఈ కేసులో ఎటువంటి పక్షపాతం లేకుండా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. పోస్ట్‌మార్టం నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు. శాస్త్రీయ పద్ధతుల ద్వారా మరణానికి కారణాన్ని కనుగొంటామని ఆయన పేర్కొన్నారు. 

click me!