రేప్ కేసులో ఆశారాంకు రేపు శిక్ష ఖరారు.. తీర్పు వెలువరించినున్న గుజరాత్ కోర్టు

By Mahesh KFirst Published Jan 30, 2023, 8:49 PM IST
Highlights

రేప్ కేసులో గుజరాత్ కోర్టు రేపు ఆశారాం బాపూపై తీర్పు వెలువరించనుంది. రేప్ కేసులో ఆశారాంను దోషిగా తేల్చిన కోర్టు శిక్షను రిజర్వ్ చేసింది. గాంధీనగర్ సెషన్స్ కోర్టు జడ్జీ డీకే సోని రేపు ఈ శిక్షను వెల్లడిస్తారు.
 

అహ్మదాబాద్: గుజరాత్ కోర్టు రేపు ఆశారాం బాపూ రేప్ కేసులో కీలక తీర్పు వెలువరించనుంది. తన అనుచరారాలైన ఓ మహిళపై కొన్ని సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడిన అభియోగాల కేసులో ఆశారాం బాపూ దోషిగా తేలాడు. శిక్షను కోర్టు రేపు వెల్లడించనుంది. గాంధీ నగర్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి డీకే సోని శిక్ష తీర్పును రిజర్వ్ చేశారు. జనవరి 31వ తేదీన వెల్లడించనున్నారు.

సూరత్‌కు చెందిన ఓ మహిళ అహ్మదాబాద్‌లోని చాంద్‌ఖేడా పోలీసు స్టేషన్‌లో అక్టోబర్ 2013లో అత్యాచారం, అక్రమ నిర్బంధం ఆరోపణలతో ఫిర్యాదు అందించింది. ఆశారాం బాపూతోపాటు మరో ఏడుగురిపై ఆరోపణలు చేయగా.. 2014 జులైలో చార్జిషీట్ దాఖలైంది.2001 నుంచి 2006 మధ్య కాలంలో అహ్మదాబాద్ శివారుల్లోని ఆశ్రమంలో ఆశారాం బాపూ పలుమార్లు ఆమెపై లైంగికదాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేశారు.

Also Read: ఆశారాం బాపూ ఆశ్రమంలో మరో దారుణం?.. అదృశ్యమైన మైనర్ బాలిక మూడు రోజుల తర్వాత ఆశ్రమంలోని కారులో విగతజీవిగా..

ఏడుగురిలో ఒకరు ఇప్పటికే మరణించగా.. ఆశారాం బాపూ భార్య సహా ఆరుగురు నిందితులపై సరైన ఆధారాలు లేవని కోర్టు నిర్దోషులుగా తేల్చింది.

సెక్షన్ 376లోని 2(సీ) (అత్యాచారం), 377 (అసహజకర నేరాలు)లు సహా ఐపీసీలోని పలు నిబంధనల కింద ఆశారాం బాపూను దోషిగా కోర్టు తేల్చింది. ప్రస్తుతం ఆశారాం బాపూ మరో రేప్ కేసులో జోధ్‌పూర్‌లోని జైలులో ఉన్నారు. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ జైలులో ఆయన యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు.

click me!