
గోవా : Goa assembly elections 2022కు ముందు భారతీయ జనతాపార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రిపై sex abuse allegations నమోదయ్యింది. ఈ క్రమంలో ఆయనను తప్పిస్తూ ముఖ్యమంత్రి Sawant నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే గోవా అర్బన్ డెవలప్ మెంట్ మంత్రి Milind Naik లైంగిక వేధింపుల ఆరోపణలతో బుధవారం మంత్రి పదవికి resign సమర్పించారు.
ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) బుదవారం అర్థరాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. నిస్పక్షపాతంగా న్యాయ విచారణ జరిగేలా చూసేందుకు మంత్రి నాయక్ రాజీనామా చేసినట్లు సీఎంఓ పేర్కొంది. నాయక్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారని, దానిని ఆమోదించి గవర్నర్ కు పంపినట్లు సీఎంఓ ట్వీట్ లో పేర్కంది. మిలింద్ నాయక్ కు లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపించడంతో మంత్రివర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.
దక్షిణ గోవాలోని మోర్ముగావ్ అసెబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి Pramod Sawant మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి శాఖను నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ నేతృత్వంలోని గత మంత్రివర్గంలో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. అంతకుముందు రోజు మంత్రి నాయక్ కేబినెట్ మంత్రిగా తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా ఒక మహిళను లైంగికంగా వేదించాడని కాంగ్రెస్ గోవా చీఫ్ Girish Chodankar ఆరోపించారు.
సీఎం సావంత్ మంత్రిని బర్తరఫ్ చేయాలని, ఆయనపై వచ్చిన ఆరోపణలపై పోలీస్ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే, గత నెల చివరి వారంలో ఓ మహిళపై మంత్రి మిలింద్ నాయక్ మానసికంగా, శారీరకంగా లైంగిక వేదింపులకు పాల్పడినట్లు చోడంకర్ ఆరోపించారు. అయితే ఆ సమయంలో మంత్రి పేరు బయట పెట్టేందుకు మహిళ విముఖత వ్యక్తం చేసింది.
అమ్మాయిల కనీస వివాహ వయసు పెంపుపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ సిఫార్సులకు కేబినెట్ ఆమోదం..
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో.. చోడంకర్ నాయక్ పేరు బయట పెట్టడంతో, గోవా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు సంకల్ప్ అమోస్కర్ కూడా మంత్రి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు.. మంత్రికి మధ్య జరిగిన ఉద్దేశపూర్వక ఆడియో సంభాషణను కూడా అమోంకర్ విడుదల చేశారు.
దీంతో ముఖ్యమంత్రి సావంత్ విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు న్యాయ బద్ధంగా జరిగేందుకు మంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు మిలింద్ నాయక్ వెల్లడించారు.