భార్యపై అనుమానం.. హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి చంపి.. తల, చేయి నరికి.. నగ్నంగా మార్చి భర్త పరార్...

Published : Dec 16, 2021, 11:30 AM IST
భార్యపై అనుమానం.. హోటల్ రూమ్‌కి తీసుకెళ్లి చంపి.. తల, చేయి నరికి.. నగ్నంగా మార్చి భర్త పరార్...

సారాంశం

ఉత్తరప్రదేశ్లోని పన్వేల్ కు చెందిన పూనమ్ కు, రాంపాల్ కు ఏడాది క్రితం వివాహం అయ్యింది. పూనమ్ స్థానిక హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది. పెళ్లయిన కొద్ది రోజులు బాగానే ఉన్న వీరి కాపురంలో అనుమానం పెనుభూతం అయింది. భార్య వేరొకరితో మాట్లాడుతుందేమో అని రాంపాల్ పూనమ్ మీద అనుమానం పెంచుకున్నాడు.

ఉత్తరప్రదేశ్ : Uttara Pradeshలో ఇటీవల సంచలనంగా మారిన కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. hotel room లో ఓ గుర్తు తెలియని మహిళ Brutal murderకు గురైంది. హత్య చేసిన నిందితులు ఆమెను నగ్నంగా మార్చి, తల, చేతిని నరికి తీసుకెళ్లారు. దీంతో మహిళ Naked corpse పోలీసులకు దొరికింది. ఈ ఘటన గత నెలలో స్థానికంగా సంచలనం రేపింది. మహిళను అంత దారుణంగా ఆమెను ఎవరు చంపారు? అని పోలీసులు విచారించారు. చివరికి ఆమె భర్తే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న అతడిని ఎట్టకేలకు గుర్తించి అరెస్టు చేశారు.

వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని పన్వేల్ కు చెందిన పూనమ్ కు, రాంపాల్ కు ఏడాది క్రితం వివాహం అయ్యింది. పూనమ్ స్థానిక హాస్పిటల్ లో నర్స్ గా పనిచేస్తోంది. పెళ్లయిన కొద్ది రోజులు బాగానే ఉన్న వీరి కాపురంలో అనుమానం పెనుభూతం అయింది. భార్య వేరొకరితో మాట్లాడుతుందేమో అని రాంపాల్ పూనమ్ మీద అనుమానం పెంచుకున్నాడు.

ఆ Suspicion పెరిగి భార్యపై కక్ష లా మారిపోయింది. గత ఆదివారం భార్యను తీసుకుని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న Lodgeకి  తీసుకువెళ్లి.. అక్కడ ఆమెను హతమార్చాలని ప్లాన్ చేశాడు. అనుకున్నట్లుగానే లాడ్జికి తీసుకెళ్లి ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఆ తర్వాత తను దొరకకూడదు అని  headను, టాటూ  ఉన్న handని నరికి..  బట్టలు తీసేసి నగ్నంగా మార్చి పరారయ్యాడు.

ఇక ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే ఎక్కడా ఒక్క క్లూ కూడా దొరకలేదు ఇటీవల హోటల్ కి 50 కిలో మీటర్ల దూరంలో ఒక లేడీస్ హ్యాండ్ బ్యాగ్ దొరికింది. దీనికి ఘటనకు సంబంధం ఉండొచ్చని అనుమానించిన పోలీసులు.. ఆ బ్యాగ్ లో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా మృతురాలు పూనమ్ అని గుర్తించారు.  ఆ తర్వాత భర్త రాంపాల్ ని వెతికి పట్టుకుని విచారించగా.. జరిగిన దారుణాన్ని బయటపెట్టాడు. దీంతో అతనిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

గుడికి వెళ్దామని తీసుకెళ్లి.. పిల్లలతో సహా నదిలోకి తోసేశాడు.. మద్యంమత్తులో ఓ భర్త ఘాతుకం

ఇలాంటి ఘటనే మైసూరులో చోటు చేసుకుంది.  పిల్లలతో కలిసి గుడికి వెళ్దామని చెప్పిన భర్త అతి దారుణంగా భార్యను హత్య చేశాడు. సంజనగూడులోని దేవాలయాయిని వెడదామని భార్యను తీసుకువెళ్లి అక్కడి నదిలో తోసేసి హత్య చేశాడు. ఆ తరువాత పిల్లలనూ తోసేశాడు. కానీ అది స్థానిక జాలర్లు గుర్తంచడంతో పిల్లలు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. 

ఈ ఘటనలో మృతి చెందిన మహిళను  దేవిగా గుర్తించారు.  నంజనగూడు తాలూకా కసువినహళ్లికి చెందిన దేవికి ముద్దహళ్లికి చెందిన రాజేష్ తో కొన్నేళ్ళ కిందటే వివాహమయ్యింది. రాజేష్ ఎప్పుడూ మద్యం మత్తులోనే ఉండేవాడు. అది ఏ సమయం అయినా కానీ తూగుతూనే ఉండేవాడు. అలాంటి భర్త చివరకు తన ప్రాణాల్ని తీస్తాడని కనీసం ఆమె ఊహించను కూడా ఊహించలేదు.  తల్లి హత్యకు గురికావడం, తండ్రి ఠాణా పాలవడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. ప్రస్తుతం తమ బంధువుల నివాసంలో ఆశ్రయం పొందుతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indian Army Romeo Force Destroys: గడ్డ కట్టే మంచులో మన ఇండియన్ ఆర్మీ| Asianet News Telugu
Tourists Enjoy New Year’s First Snow in Chamba: మంచు కొండల్లో న్యూఇయర్ వేడుకలు | Asianet News Telugu