ఆమెకు రక్షణ లేదా? 14 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్..ముగ్గురు యువకులపై కేసు నమోదు, ఇద్దరి అరెస్ట్..

By Rajesh KarampooriFirst Published Jan 1, 2023, 4:20 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ల బాలికతో పాటు ముగ్గురు నిందితులు గ్యాంగ్ రేప్ ఘటనకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేశారు

మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కఠినతర చట్టాలు తెచ్చి సంవత్సరాలు గడుస్తున్నా వారిపై జరుగుతున్న దాడులు విషయంలో మాత్రం మార్పు రావడంలో లేదు. ఏడాదికేడాది ఆ సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ గణాంకాలు కూడా అదే చెప్పుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని మౌ జిల్లాలోని ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. దీనిపై ఘోసి పోలీసు స్టేషన్‌లో అత్యాచారం ఆరోపణలపై ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘోసి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో శుక్రవారం రాత్రి సమయంలో 14 ఏళ్ల బాలిక చెత్త వేయడానికి వెళ్లిందని,  ఈ సమయంలో ముగ్గురు యువకులు వచ్చి ఆమెను కిడ్నాప్ చేసి.. తీసికెళ్లారు. ఈ దారుణాన్ని కొంతమంది గ్రామస్తులు చూశారని అదనపు పోలీసు సూపరింటెండెంట్ త్రిభువన్ నాథ్ త్రిపాఠి తెలిపారు. గ్రామస్తులు బాలికను వెతుక్కుంటూ వెళ్లారు. అక్కడ ఆమె కొంత దూరంలో ఉన్న ట్యూబ్‌వెల్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న చిన్న గదిలో ఆ బాలిక కనిపించింది. ఆ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. ఆ సమయంలో ఆ బాలిక  చేతులు, కాళ్ళు కట్టి, నోటిలో గుడ్డతో కనుగొనబడిందని అదనపు ఎస్పీ   తెలిపారు.

 గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి బాలికను బయటకు తీశారు. డిసెంబరు 30వ తేదీన తన కుమార్తె చెత్త వేయడానికి బయటకు వెళ్లినప్పుడు నిందితులు ఆమెను తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించిన మైనర్ బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశారు. గ్రామంలో నివసిస్తున్న ముగ్గురు యువకులపై సామూహిక అత్యాచారం ఆరోపణలపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు త్రిభువన్ నాథ్ తెలిపారు. అనే విషయంపై కూడా విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

మహిళపై సామూహిక అత్యాచారం  

గతంలో, ధోల్పూర్ నగరంలోని నిహల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం కేసు వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ఇద్దరు ప్రస్తుత, ఒక మాజీ కౌన్సిలర్‌ ఉన్నారు. ముగ్గురు నిందితులపై మహిళా పోలీస్ స్టేషన్‌లో నామినేట్ కేసు పెట్టింది. పోలీసులకు అందిన సమాచారం మేరకు నిందితులు సదరు మహిళకు డబ్బులు అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బులు వెనక్కి తీసుకుంటామనే సాకుతో మహిళను మభ్యపెట్టి ధోల్‌పూర్‌కు పిలిచారు. నిర్జన ప్రదేశంలో నిందితులు వరుసగా అత్యాచారానికి పాల్పడ్డారు.

యూపీలో వేర్వేరు ఘటనల్లో 12వ తరగతి చదువుతున్న ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎనిమిది రోజుల వ్యవధిలో 12వ తరగతికి చెందిన ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మూడు ఆత్మహత్యలకు సంబంధించి సీతాపూర్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. కుర్షియన్‌పూర్వా, జ్యోతిషాహలంపూర్ గ్రామం  తివారిపూర్వా గ్రామంలో ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి.

click me!