Operation Sindoor : గగన్‌యాన్ వ్యోమగామికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పిలుపు.. అసలేం జరుగుతోంది?

Published : May 08, 2025, 04:37 PM IST
Operation Sindoor : గగన్‌యాన్ వ్యోమగామికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పిలుపు.. అసలేం జరుగుతోంది?

సారాంశం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నేతృత్వంలోని గగన్‌యాన్ మిషన్ కోసం సిద్దమవుతున్న కెప్టెన్ అజిత్ కృష్ణన్‌ను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి పిలుపు వచ్చింది. వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆయన ఐఎఎఫ్ నుండి ఆదేశాలు అందాయి  

ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్‌తో సైనిక ఉద్రిక్తతలు పెరగడంతో భారత వాయుసేన కీలక నిర్ణయం తీసుకుంది.  భారతదేశపు మొట్టమొదటి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం ఎంపికైన నలుగురు భారత వైమానిక దళ (IAF) అధికారులలో ఒకరైన గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్‌ను ఎయిర్ ఫోర్స్ అత్యవసరంగా వెనక్కి పిలిపించింది. ఢిల్లీలో జరిగిన గ్లోబల్ స్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్న కృష్ణన్‌కు తిరిగి రిపోర్ట్ చేయాలని వాయుసేన ఆదేశాలు అందాయి. "ప్రస్తుత పరిస్థితి కారణంగా నన్ను IAF వెనక్కి పిలిపించింది" అని కృష్ణన్ ధృవీకరించారు. 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మంచి అనుభవం కలిగిన పైలట్ గా అజిత్ కృష్ణన్ కు పేరుంది. అయితే అతడు భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతరిక్ష కార్యక్రమంలో కీలక వ్యక్తి. ఇస్రో నేతృత్వంలోని గగన్‌యాన్ మిషన్ ముగ్గురు వ్యోమగాములను మూడు రోజుల పాటు అంతరిక్షంలోకి పంపించడం లక్ష్యంగా పెట్టుకుంది. వరుస మానవరహిత పరీక్షల తర్వాత మొదటి మానవ సహిత ప్రయోగం 2027 ప్రారంభంలో జరుగుతుందని భావిస్తున్నారు.

2003లో IAFలో చేరిన గ్రూప్ కెప్టెన్ కృష్ణన్ కు యుద్ద విమానాలను నడపడంలో చాలా అనుభవం ఉంది. Su-30 MKI మరియు MiG-29 వంటి అత్యాధునిక యుద్ద విమానాలలో దాదాపు 2,900 గంటల పాటు ఎగిరిన ఆయన పరీక్షా పైలట్‌గా మరియు ఫ్లయింగ్ బోధకుడిగా పనిచేశారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sabarimala Karthika Deepam: స్వామియే శరణం.. శబరిమల కార్తీక దీపం చూశారా? | Asianet News Telugu
Putin RaGhat Visit:రాజ్ ఘాట్ సందర్శించనున్న పుతిన్.. ఢిల్లీలో భారీగా భద్రత | Asianet News Telugu