From the IAF Vault: భారత వైమానిక దళానికి మిరాన్ష ఎప్పటికీ ప్రత్యేకమే.. ఎందుకంటే?

By Anchit GuptaFirst Published Jan 28, 2023, 1:41 AM IST
Highlights

భారత వైమానిక దళ చరిత్రకారుడు అంచిత్ గుప్తా మిరాన్షాకు ఉన్న చారిత్రక ప్రశస్తిని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు. బర్మా క్యాంపెయిన్‌లోకి భారత వైమానిక దళ ప్రవేశానికి ఇదే బీజం వేసి ఉంటుందని చెబుతున్నారు.
 

న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి మిరాన్ష ఎప్పటికీ ప్రత్యేకమే. ఎందుకంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బీజంగా మొలకెత్తుతున్న క్షణాలకు మిరాన్ష వేదికగా ఉండింది. భారత వైమానిక దళ తొలి ఆపరేషన్ వజీరిస్తాన్‌లో జరిగింది. ఇది ప్రస్తుత ఆఫ్గనిస్తాన్ బార్డర్. భారత వైమానిక దళ ఆపరేషన్లకు తొలినాళ్లలో కేంద్రక స్థానంలో మిరాన్ష ఎయిర్ ఫోర్స్ బేస్ ఉన్నది. ఇక్కడ ఐఏఎఫ్ పైలట్లు ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చింది. మిరాన్ష చారిత్రక ప్రశస్తి గురించి చూచాయగా చూద్దాం.

1849లో రెండో సిక్కుల యుద్ధం తర్వాత నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ బ్రిటీష్ ఇండియాలో భాగమైంది. ఈ ప్రాంతాన్ని బ్రిటీష్ ప్రభుత్వం రెండు భాగాలుగా విభజించింది. ఒకటి సెటిల్ ఏరియా, మరొకటి ట్రైబల్ ఏరియా. ట్రైబల్ ఏరియా నేరుగా అఫ్గనిస్తాన్‌తో సరిహద్దును కలిగి ఉంటుంది. ఇక్కడ బ్రిటీష్‌కు రెండు ప్రధాన లక్ష్యాలు ఉండేవి. ఒకటి బ్రిటీష్ నియంత్రణను ఎంతమాత్రం సహించని పఠాన్ తెగ తరుచూ దాడులకు పాల్పడకుండా అడ్డుకోవడం, నార్త్ వెస్ట్ నుంచి రష్యా  దురాక్రమణ చేయకుండా చూసుకోవడం రెండో లక్ష్యం.

అయితే, 1900 కాలానికి రష్యాతో బ్రిటీష్ సంబంధాలు మెరుగుపడ్డాయి. దీంతో చాలా వరకు ట్రైబల్ ఏరియా నుంచి బలగాలను ఉపసంహరించుకుంది. స్థానిక మిలీషియాపైనే ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తుండేది. ఈ మిలీషియాను ఇండియన్ ఆర్మీ అధికారుల పర్యవేక్షణలో ఉండేది. ఖైబర్ రైఫిల్స్, తోచి స్కైట్స్ యూనిట్లూ ఇందులో ఉండేవి.

మిరాన్షా అనే పేరు స్థానిక వజీరి ఉచ్ఛరణ మిరూమ్ షామ్ అనే ఒక కుగ్రామం నుంచి వచ్చింది. ఈ కుగ్రామం మొత్తం మిలిటరీ పోస్టులు, కోటలతో నిండి ఉండేది. ఇందులో తోచీ కోట తోచి నది తీరంలో 3,100 అడుగుల ఎత్తులో ఉండేది.

దీన్ని 1905లో బ్రిటీష్ నిర్మించింది. కానీ, ఆ తర్వాత తోచి స్కౌట్‌లే దీన్ని వినియోగించుకునేవారు. కోట గోడల చుట్టూ కాగడాలతో కోట గోడలు కనిపించేవి. కోట గోడల నుంచి ఐదు అడుగుల అడుగున పది అడుగుల వెడల్పుతో ప్లాట్‌ఫామ్ ఉండేది. కింద ఉండే క్వార్టర్‌లకు ఈ కోట ఒక పై కప్పుగా కనిపించేది.

Also Read: From the IAF Vault: సీ-87 విమానం ఎవరెస్టు శిఖరం ఎల్లలు దాటింది.. ఎలాగో తెలుసా?

ట్రైబల్ దాడులు కొనసాగుతూనే వచ్చాయి. కానీ, 1919లో అఫ్గన్ వజీరిస్తాన్ పై ఆక్రమణకు దిగింది. అదే సమయంలో ట్రైబల్స్ కూడా దాడికి వచ్చారు. దీంతో బ్రిటీష్ నియంత్రణను పునస్థాపించడానికి సుమారు పది వేల ట్రూపులు కదనరంగంలోకి దిగాయి. ఈ దాడుల్లో సుమారు 1,300 మంది మరణించారు. ఇక్కడ వైమానిక దాడులు ప్రధాన పాత్ర పోషించాయి. ఐదు రాయల్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్‌లు అఫ్గనిస్తాన్, ట్రైబల్స్ పై బాంబుల వర్షం కురిపించాయి. ఈ వైమానిక దాడులే ఆ యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాయి. ఈ దాడుల్లో చాలా వాటికి మిరాన్షాను ఉపయోగించారు.

ఈ విజయంతో పొంగిపోయిన ప్రభుత్వం మిరాన్షాను రాయల్ ఎయిర్ ఫోర్స్‌(ఆర్ఏఎఫ్)కు బేస్‌గా ఉపయోగించుకోవాలని డిసైడ్ అయింది. 1925 మిరాన్షాను బేస్‌గా ఉపయోగించుకుంది. కమాండ్ ఆఫ్ వింగ్ సీడీఆర్ ఆర్‌సీఎం పింక్ అపూర్వ నిర్ణయం తీసుకుంది. ఆర్మీ సహాయం లేకుండా ట్రైబల్స్ పై ఎయిర్ ఫోర్స్ దాడికి దిగింది. దీన్నే పింక్స్ వార్ అంటారు. 54 రోజులపాటు చేపట్టిన ఈ ఆపరేషన్‌లో 250 టన్నుల బాంబులను పగలు, రాత్రిళ్లు కురిపించింది. రాయల్ ఎయిర్ ఫోర్స్ స్వతంత్రంగా యుద్ధం చేయడం ఇదే తొలిసారి. ఈ దాడుల తర్వాతే 1925 మే 1న ట్రైబల్స్ శాంతి కోసం ప్రతిపాదన చేశారు. ఈ దాడుల్లో ఇద్దరు మరణించగా.. ఒక విమానాన్ని ఫోర్స్ నష్టపోయింది. అప్పటి నుంచి మిరాన్షాలో ఒక విమానాన్ని ఆర్ఏఎఫ్ మెయింటెయిన్ చేసింది.

1936లో ఘాజీ మిర్జాలీ ఖాన్ వజీర్ బ్రిటీష్ పాలనపై జిహాద్ ప్రకటించాడు. రజ్మాక్ గారిసన్‌తో కమ్యూనికేషన్ తెగిపోయేలా ఆయన కార్యకలాపాలు సాగాయి. వజీర్ ఫాలోవర్లను అడ్డుకోవడానికి సుమారు 30 వేల ట్రూపులు విమానాలు, వాహనాలతో మోహరించారు.

వీటి గురించి ఇంకా సమాచారం లేని ఏకైక (1933లో ఏర్పడ్డ) ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 1936 ఏప్రిల్‌లో కరాచీలోని ద్రిగ్ రరోడ్ నుంచి పేషావర్‌కు వెళ్లింది. 20 ఆర్ఏఎఫ్ స్క్వాడ్రన్‌తోపాటు ఈ ఫ్లైట్ వెళ్లింది. ఇంత పెద్ద స్థాయిలో మోహరింపులు జరుగుతున్న ఎయిర్ ఆపరేషన్స్ కమాండర్ పేషావర్, గ్రూప్ కెప్టెన్ ఆర్ఎన్ బాటమ్లీకి ఐఏఎఫ్‌కు విశ్వాసం లేదు. అందుకే పేషావర్‌లోనే ఉండిపోవాలని సూచించారు. అంతేకాదు, అధికారులను సెలవుపై వెళ్లిపోవాలని చెప్పారు. కానీ, 1937 ఆగస్టున 1 స్క్వాడ్రన్ ఐఏఎఫ్ ఫ్లైట్‌ను మిరాన్షాకు పంపాలని ఓ రెడ్ లెటర్ వచ్చింది. అది ఐఏఎఫ్‌ సాహస యాత్రకు తొలి అడుగు.

Also Read: From the IAF vault: సియాచెన్‌ను ఏలిన హెలికాప్టర్ల స్టోరీ

మిరాన్షాలోని దుర్భర, కఠినమైన పరిస్థితులు వైమానిక ఆపరేషన్లకు సవాళ్లను విసిరేవిగా ఉంటాయి. చిన్న రన్‌వే, శ్రతువులు దాడులు చేస్తుంటే లక్ష్యాలను ఛేదించడమే కాదు, 3000 ఎత్తులో ఉన్న ఈ మిరాన్షా బేస్ చుట్టూ కొండలను కలిగి ఉంది. ఏ క్షణంలోనైనా హిమపాతం, తుఫాన్లు వచ్చే ముప్పుతో విమానాలను గాల్లోకి ఎగిరించడం కష్టమే కాదు.. ప్రమాదకరంగా కూడా ఉండేది. మిరాన్షాలో ఐఏఎఫ్ ఫస్ట్ డిటాచ్‌మెంట్ 1937 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 21 వరకు, నవంబర్‌లో మరో ఐదు రోజులు ఆపరేషన్‌లో పాల్గొంది. 1,400 ఆపరేషనల్ అవర్స్, 100 శాతం సర్వీసెబిలిటీతో ఆర్ఏఎఫ్ రికార్డులు అన్నింటినీ ఐఏఎఫ్ స్క్వాడ్రన్ బద్దలు కొట్టింది. ఇది ఐఏఎఫ్ పైలట్ల లో విశ్వాసాన్ని పెంచడమే కాదు.. ధైర్యాన్ని ప్రోది చేవాయి. అందుకే అప్పుడే మేటి పైలట్లు ఐఏఎఫ్‌ (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) తయారు చేసుకుంది. మెహర్ సింగ్, ఘులాం అలీ, అరియాన్ సింగ్, ఎస్ఎన్ గోయల్, అర్జన్ సింగ్ వంటి యోధులు తమ సాహసకార్యాలు ఇక్కడే ఎక్కువగా చేశారు. 

మిరాన్ష ఐఏఎఫ్‌కు ఎప్పటికీ ప్రత్యేకమే అని వింగ్ కమాండర్ అవాన్ అంటారు. ఐఏఎఫ్ విస్తరణకు ఈ ఆపరేషన్లు ప్రేరకంగా, బలాలుగా పని చేశాయని వివరించారు. తమను మేటి ఏవియేటర్లుగా తీర్చి దిద్దాయని తెలిపారు. బర్మా క్యాంపెయిన్‌లోకి ఐఏఎఫ్ ప్రవేశానికి ఇక్కడే పునాది పడి ఉంటుందని వివరించారు.

 

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

click me!