ప్రేమ జంటను బెదిరించి, యువతి న్యూడ్ వీడియో తీసి...

By narsimha lodeFirst Published Mar 7, 2019, 12:43 PM IST
Highlights

కర్ణాటక రాష్ట్రంలో ప్రేమికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను దుండగులు దోచుకొన్నారు. అంతేకాదు యువతిని వివస్త్రను చేసి వీడియో తీసి ఘటన కేంగేరీ పోలీస్ స్టేషన్‌  పరిధిలో చోటు చేసుకొంది.

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రేమికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను దుండగులు దోచుకొన్నారు. అంతేకాదు యువతిని వివస్త్రను చేసి వీడియో తీసి ఘటన కేంగేరీ పోలీస్ స్టేషన్‌  పరిధిలో చోటు చేసుకొంది.  ఈ ఘటనపై యువతి ప్రియుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని  కెంగేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకొంది.  ఓ క్యాబ్ డ్రైవర్‌తో ఓ యువతి ప్రేమలో పడింది. ఆదివారం నాడు ఆమెను స్వగ్రామానికి పంపేందుకు యువకుడు ఆమెను తీసుకొని కెంగేరీ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చాడు. 

ఈ ప్రేమ జంట రైల్వేస్టేషన్‌కు వెళ్లే సమయానికి  యువతి ప్రయాణించాల్సిన రైలు వెళ్లిపోయింది. తెల్లవారుజామున మరో రైలు వస్తోందని  రైల్వే అధికారులు చెప్పడంతో రైల్వేస్టేషన్ పక్కనే కారులో కూర్చొన్నారు. 

ఈ జంట కారులో ఏకాంతంగా ఉన్న విషయాన్ని గమనించిన నలుగురు దుండగులు  ఈ జంటను  బెదిరించారు. ఈ జంట వద్ద ఉన్న డబ్బును, బంగారు ఆభరణాలను  దోచుకొన్నారు. 

అంతేకాదు ఆ యువతిని వివస్త్రను చేసి మొబైల్ ఫోన్లో ఆ వీడియోలను రికార్డు చేశారు.  ఈ దోపీడీ విషయాన్ని ఎవరికైనా చెబితే యువతి వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించారు. 

 దీంతో భయపడిన ఆ జంట ఒక్కరోజు చడీ చ్పపుడు లేకుండా ఉన్నారు.  మరునాడు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


 

click me!