ప్రమాదంలో మాజీ మిస్ కేరళ, రన్నరప్ లు మృతి.. ఆడికారులో వెంటాడి మరీ...దారుణం..డ్రగ్ పెడ్లర్ల పనేనా?

By AN TeluguFirst Published Nov 20, 2021, 5:08 PM IST
Highlights

2021, నవంబర్ 1న మాజీ Miss Kerala అన్నీ కబీర్ (25), రన్నరప్ అంజనాలు ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో అన్సీ కవీర్, అంజనాలు అక్కడికక్కడే మృతి చెందారు.

తిరువనంతపురం : మాజీ మిస్ కేరళ Ansi Kabir (25), రన్నరప్ Anjana Shajan(26) ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కావాలనే కొందరు వ్యక్తులు వీరిని ఆడికారులో వెంబడించినట్లు పోలీసులు గుర్తించారు. కారులో వీరిని వెంబడించిన Size Thankachanకు Drug peddlersతో సంబంధాలున్నట్లు విచారణలో తెలిసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

2021, నవంబర్ 1న మాజీ Miss Kerala అన్నీ కబీర్ (25), రన్నరప్ అంజనాలు ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ సంఘటనలో అన్సీ కవీర్, అంజనాలు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే చనిపోవడానికి ముందు వీరు Fort Kochi ప్రాంతంలో ఉన్న హైఎండ్ Hotel No.18లో పార్టీకి హాజరయినట్లు పోలీసులు తెలిపారు.

పార్టీ ముగిసిన తరువాత models తిరిగి ఇంటికి వెడుతుండగా.. partyకి వచ్చిన కొందరు అతిథులు మోడల్స్ ఇంటికి వెల్తుండాగా ఆడి కారులో వారిని వెంబడించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలో audi car మోడల్స్ ను ఫాలో అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆడి కారు డ్రైవ్ చేసిన వ్యక్తి సైజు థంక్ చన్ అని... అతడికి కొచ్చిలోని డ్రగ్ పెడ్లర్స్ తో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

భార్య వేధింపులు.. నవ వరుడు ఆత్మహత్య.. పెళ్లి చేసుకున్న వారానికే విషాదం

బెంగళూరు నుంచి కొచ్చికి మాదక ద్రవ్యాలు తెచ్చే గ్రూప్ కోసం సైజు పని చేసేవాడని పోలీసులు తెలిపారు. పార్టీ ముగిసిన తరువాత తనతో రావాల్సిందిగా సైజు మోడల్స్ ని ఆహ్వానించాడు. కానీ వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో సైజు వారికి ఫాలో అయ్యాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగి anjana, ansi మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పార్టీ జరిగిన హోటల్ యజమాని రాయ్ వాయలత్ తో పాటు కొందరు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. 

మే 2021లో సైజు ఫొటో జత చేసిన ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి నంబరు 18 హోటల్ లో జరిగిన పార్టీలలో డ్రగ్స్ వాడినట్లు తెలుపుతోంది. అయితే, హోటల్ యజమాని రాయ్ వాయలత్ కు పోలీసులతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ కేసు తదుపరి విచారణ ముందుకు సాగలేదు. 

click me!