కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

By telugu teamFirst Published Aug 24, 2019, 12:42 PM IST
Highlights

 గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కాగా... ఇటీవల తీవ్ర అనారోగ్యం  కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. కాగా... ఇటీవల తీవ్ర అనారోగ్యం  కారణంగా ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే అరుణ్ జైట్లీ శనివారం కన్నుమూశారు. గత కొద్ది రోజుల క్రితమే బీజేపీ సీనియర్ మహిళా నేత సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. వరసగా ఇద్దరు సీనియర్ నేతలను కోల్పోవడంతో బీజేపీ నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

అరుణ్ జైట్లీ 1952 డిసెంబర్ 28వ తేదీన జన్మించారు. 2014 నుండి 2019 వరకు మోడీ మంత్రివర్గంలో అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగారు.వాజ్‌పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో కూడ అరుణ్ జైట్లీ మంత్రిగా పనిచేశారు.

 2009 నుండి 2014 లో రాజ్యసభలో ప్రధానప్రతిపక్షనేతగా ఆయన కొనసాగారు.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు పాస్ కావడంలో అరుణ్ జైట్లీ రాజ్యసభలో కీలకంగా వ్యవహరించారు. సుప్రీంకోర్టులో న్యాయవాదిగా అరుణ్ జైట్లీ పనిచేశారు.

న్యూడిల్లీలోని సెయింట్ గ్జావేరీ స్కూల్ లో విద్యాభ్యాసం చేశారు.  శ్రీరామ్ కాలేజీ నుండి బీకాం డిగ్రీ తీసుకొన్నారు. 1973లో జైట్లీ డిగ్రీ పూర్తి చేశారు. 1977లో ఢిల్లీ లా యూనివర్శిటీ నుండి ఆయన లా పట్టా పొందారు.

ఢిల్లీ యూనివర్శిటీలో విద్యాభ్యాసం చేసే సమయంలో అరుణ్ జైట్లీ ఏబీవీపీలో పనిచేశారు. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్ధిసంఘం నేతగా కూడ ఆయన 1974లోపనిచేశారు. 

1975-77 కాలంలో హక్కుల కోసం పోరాటం చేశాడు.దీంతో ఆయనను జైల్లో పెట్టారు. అవినీతికి వ్యతిరేకంగా రాజ్ నారాయణ్, జయప్రకాష్ నారాయణ చేపట్టిన ఉద్యమంలో అరుణ్ జైట్లీ కీలక పాత్ర పోషించారు.

ఈ ఉద్యమంలో జయప్రకాష్ నారాయణ చేత నియమింపబడిన యూత్, స్టూడెంట్స్ జాతీయ కమిటీకి అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీని నియమించారు.1977లో లోక్ తాంత్రిక్ యువ మోర్చా అధ్యక్షుడిగా అరుణ్ జైట్లీ ఉన్న సమయంలో కాంగ్రెస్ ఓటమి పాలైంది. 

అదే సమయంలో ఏబీవీపీ డిల్లీ యూనివర్శిటీ అధ్యక్షుడిగా నియమించారు. అంతేకాదు ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా ఆయనను నియమించారు.ఆ తర్వాత ఆయన బీజేవైఎం అధ్యక్షుడిగా నియమించారు. 1980లో బీజేపీ కార్యదర్శిగా ఆయనను నియమితులయ్యారు.

related news

కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత

అరుణ్ జైట్లీ కన్నుమూత... తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

అరుణ్ జైట్లీ: తెర వెనక వ్యూహకర్త, సుష్మా స్వరాజ్ లాగే...

అరుణ్‌జైట్లీ ప్రస్థానం: విద్యార్ధి నేత నుండి కేంద్ర మంత్రిగా....

డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..

అరుణ్ జైట్లీకి క్రికెట్ అంటే తెగ పిచ్చి: జెపితో కలిసి...

అరుణ్ జైట్లీ మృతి.. ఢిల్లీకి అమిత్ షా పయనం

click me!