ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్...ఐదుగురు మావోయిస్టులు హతం

Published : Aug 24, 2019, 11:34 AM IST
ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్...ఐదుగురు మావోయిస్టులు హతం

సారాంశం

అంబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.

ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ లో శనివారం భారీ  ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ  ఘటనలో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు భారత జవాన్లకు తీవ్రంగా గాయాలయ్యాయి. అంబుజ్ మడ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.

 కాగా... మావోయిస్టులను ఎదుర్కొందుకు మరింత మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అవసరం కాగా... ఘటనాస్థలికి వారు  చేరుకోలేకపోతున్నట్లు సమాచారం. మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. 

మావోయిస్టులు ఎక్కువ మంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు జవాన్లను చికిత్స నిమిత్తం తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Heavy Rush at Sabarimala Temple అయ్యప్ప స్వాములతో కిటకిట లాడిన శబరిమల | Asianet News Telugu
దేశంలోని 55 శాతం సెల్ ఫోన్లు తయారయ్యేది ఎక్కడో తెలుసా?