బాధితురాలిపై రేప్ జరగలేదు, దానివల్లే మృతి: హత్రాస్ ఘటనపై ఏడీజీ ప్రశాంత్

By narsimha lodeFirst Published Oct 1, 2020, 5:00 PM IST
Highlights

హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్  తేల్చి చెప్పారు. మెడకు గాయంతోనే బాధితురాలు చనిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: హత్రాస్ బాధితురాలిపై రేప్ జరగలేదని యూపీ ఏడీజీ ప్రశాంత్ కుమార్  తేల్చి చెప్పారు. మెడకు గాయంతోనే బాధితురాలు చనిపోయిందని ఆయన స్పష్టం చేశారు.

హత్రాస్ లో 19 ఏళ్ల యువతి గ్యాంగ్ రేప్ గురైన గత నెల 29వ తేదీన మరణించింది.  అదే రోజు రాత్రి కుటుంబసభ్యులకు తెలియకుండానే ఆమె అంత్యక్రియలు నిర్వహించడం కలకలం రేపింది.అయితే మృతురాలిపై అత్యాచారం జరగలేదని ఏడీజీ చెప్పడం కలకలం రేపుతోంది.

గురువారం నాడు యూపీ ఏడీజీ మీడియాతో మాట్లాడారు. ఫోరెన్సిక్ రిపోర్టులో స్పెర్మ్ కన్పించలేదన్నారు. బాధితురాలి నాలుక కోశారని చెప్పడం అవాస్తవమన్నారు.  ఈ విషయమై ఆమె వాంగ్మూలం ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. 

కొందరు ఉద్దేశ్యపూర్వకంగానే దీన్ని అత్యాచార ఘటనగా మలిచారని ఆయన  చెప్పారు.దేశంలో అస్థిరత సృష్టించేందుకు కొందరు కావాలనే కుట్ర పన్నారని ఆనయ ఆరోపించారు.   ఈ ఘటనకు పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకొంటామని ఆయన చెప్పారు.

యువతి గొంతు కోశారని, గర్భాశయ వెన్నెముక గాయంతో బాధపడుతోందని ఫోరెన్సిక్  రిపోర్టు చెబుతోంది. తుది నివేదికలో మాత్రం అత్యాచారం గురించి ప్రస్తావించలేదు.ఆమెపై అత్యాచారం లేదా సామూఇక అత్యాచారం జరగలేదని విసెరా ఫోరెన్సిక్ నివేదిక రుజువు చేసిందని ఉత్తర ప్రదేశ్ ఏడీజీ ప్రశాంత్ కుమార్ చెప్పారు.

కుల ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు కొందరు ఈ విషయాన్ని వక్రీకరించారన్నారు. వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు.ఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత శాంపిల్స్ సేకరించడం వల్ల స్పెర్మ్  నమూనాలు ఉండవని నిపుణులు చెబుతున్నారు.

గర్భాశయం వెన్నెముక మొద్దుబారిందని ఈ నివేదిక చెబుతోంది.  ఆమెపై దాడి చేసినవారు ఆమె గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఆమె దానిని కొరికినందున  నాలుక తెగిందని పోలీసులు చెప్పారు. ఈ విషయాన్ని ఆమె సెప్టెంబర్ 22వ తేదీన వాంగూల్మంలో చెప్పిందని ప్రశాంత్ కుమార్ తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 29వ తేదీన ఇచ్చిన శవ పరీక్ష నివేదికలో అత్యాచారం, గొంతు పిసికినట్టుగా ఉంది. గర్భాశయ వెన్నెముక గాయంతో బాధపడుతోందని ఆ రిపోర్టు తెలిపింది.సెప్టెంబర్ 22న ఆమెను అలీఘర్ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ప్రాథమిక రిపోర్టు ప్రకారంగా బలవంతంగా రేప్ చేసే ప్రయత్నం చేసినట్టుగా అభిప్రాయపడ్డారు.


 

click me!