విద్యుద్ఘాతంతో ఆడ చిరుత, రెండు పిల్లలు మృత్యువాత.. అడవి పందుల కోసం పెట్టిన కరెంటు వైర్లు తాకడంతో ఘటన..

Published : Aug 29, 2023, 02:21 PM IST
విద్యుద్ఘాతంతో ఆడ చిరుత, రెండు పిల్లలు మృత్యువాత.. అడవి పందుల కోసం పెట్టిన కరెంటు వైర్లు తాకడంతో ఘటన..

సారాంశం

అడవి పందుల కోసం వేటగాళ్లు పెట్టిన కరెంట్ తీగను తాకి మూడు చిరుతలు మరణించాయి. ఇందులో ఒక ఆడ తల్లి చిరుత ఉండగా.. మిగితా రెండు దాని పిల్లలు. ఈ ఘటన మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో ఉన్న డియోరి ఫారెస్ట్ రేంజ్ జరిగింది. 

అడవి పందులను వేటాడేందుకు పెట్టిన కరెంటు తీగలు తాకి ఓ ఆడ చిరుత పులి, దాని పిల్లలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని  గోండియా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ వన్యమృగాల మృతికి కారణమైనట్టుగా అనుమానిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని డియోరి ఫారెస్ట్ రేంజ్ లో దుర్వాసన వస్తోందని ఓ గ్రామస్తుడు అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కేంద్రానికి ధైర్యం ఉంటే చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేయాలి - సంజయ్ రౌత్

వివరాలు ఇలా ఉన్నాయి. అడవి పందులను వేటాడాలనే ఉద్దేశంతో గోండియా జిల్లా డియోరి ఫారెస్ట్ రేంజ్ లోని పరిధిలో ఉన్న అటవీ ప్రాంతంలో సమీప గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులు ఆగస్టు 26వ తేదీన రాత్రి సమయంలో కరెంటు తీగలను అమర్చారు. ఆ వైర్లకు తాకి అడవి పందులు చనిపోతాయని వారు భావించారు. కానీ ఆ ప్రాంతంలో తన పిల్లలతో సంచరిస్తున్న ఓ ఆడ చిరుత పులి ఆ వైర్లను తాకింది. దాంతో పాటు వాటి రెండు పిల్లలు కూడా వాటిని తాకడంతో మొత్తం మూడు చిరుతలు మృత్యువాత పడ్డాయి.

అయితే ఆ ప్రాంతంలో ఓ గ్రామస్తుడు సంచరిస్తున్న సమయంలో దుర్వాసన వచ్చింది. దీంతో ఆయన ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఆడ చిరుతపులి, రెండు పిల్లల కళేబరాలు బయటపడ్డాయి. ఆ ఘటనా స్థలంలో వేటకు ఉపయోగించిన విద్యుత్ వైర్లను అధికారులు గుర్తించారు.

ఢిల్లీ బాలికపై ప్రేమోదయ్ ఖాఖా కుమారుడు కూడా అత్యాచారానికి పాల్పడ్డాడా? దీనిపై పోలీసులు ఏమన్నారంటే?

నిందితుల కోసం పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు భోయార్తోలా, మెహతాఖేడా గ్రామాలకు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ విచారించిన అనంతరం వారిలో నలుగురిని అరెస్టు చేశారు. ఆగస్టు 26వ తేదీన రాత్రి అడవి పందులను వేటాడేందుకు లైవ్ వైర్లు వేసినట్లు నలుగురు అంగీకరించారని అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జీఎఫ్ రాథోడ్ ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. అయితే ఆ వైర్ల వల్ల చిరుతలు మరణించాయని చెప్పారు.

మేకల కోసం మొదలైన గొడవ.. జననాంగాలను కొరికిన పక్కింటి వ్యక్తి.. స్పృహ కోల్పోయిన బాధితుడు.. 

కాగా.. చిరుత పులుల శరీర భాగాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని అన్నారు. వాటికి పోస్టుమార్టం, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసిన అనంతరం మృతదేహాలను దహనం చేశామని చెప్పారు. ఆ నలుగురి నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్టు వివరించారు. 
 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?