
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. మరో వర్గానికి చెందిన పదో తరగతి విద్యార్థిపై మరోవర్గానికి చెందిన విద్యార్థులు విక్షచణరహితంగా దాడి చేశారు. గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పాఠశాలలో పిల్లల మధ్య వాగ్వాదం జరిగింది. బంధువుపై వేధింపులకు నిరసనగా పాఠశాలలో వివాదం ముదిరిందని వాపోతున్నారు.
ఆ తర్వాత బాధితవిద్యార్ధి తన సోదరుడితో కలిసి స్కూల్ నుంచి తిరిగి వస్తుండగా దారిలో నలుగురు విద్యార్థులు ఆ విద్యార్థిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని చిక్సిత నిమిత్తం ఆస్పత్రికి తరలించగా..చిక్సిత పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నలుగురు విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఘటనతో ఖేరీలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు స్థానిక ప్రజలతో కలిసి ఖేరీ చౌరాలో ఆందోళన చేపట్టారు.విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతి చెందిన విద్యార్థి పరమానంద్ గా గుర్తించారు.
ప్రయాగ్‌రాజ్ విద్యార్థిని హత్య కేసులో పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ విషయమై పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లడవుతున్నాయి. కుటుంబ కలహాల కారణంగానే ఈ దారుణం జరిగిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థిపై విచక్షణ రహితంగా దాడి చేశారనీ, దాదాపు అరగంట పాటు రోడ్డుపై దాడి జరిగిందనీ, ఆ సమయంలో అతని సోదరి తన సోదరుడిని రక్షించమని ఇతరులను వేడుకున్నాడని, కానీ స్థానికులు ఆ దాడి అడ్డుకునే ప్రయత్నం చేయలేదని పోలీసులు తెలిపారు. సుమారు అరగంటపాటు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన విద్యార్థి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే కుటుంబసభ్యులతో పాటు మరికొందరు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆస్పతికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయింది.
ఘటన స్థలంలో బాధిత కుటుంబంతో సహా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను ఒప్పించి ధర్నాను నిలువరించేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ఘటనపై ప్రయాగ్‌రాజ్ ఏసీపీ రాజీవ్ యాదవ్ మాట్లాడుతూ.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నలుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరి కోసం అన్వేషణ సాగుతోందని తెలిపారు.