దారుణం.. తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి, గొంతుకోసి చంపిన క్లాస్ మేట్స్... చివరి కోరికగా రసగుల్లాలు తినిపించి

Published : Aug 29, 2023, 01:35 PM IST
దారుణం.. తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి, గొంతుకోసి చంపిన క్లాస్ మేట్స్... చివరి కోరికగా రసగుల్లాలు తినిపించి

సారాంశం

బెంగాల్ లో ఓ బాలుడిని క్లాస్ మేట్సే కిడ్నాప్ చేశారు. తాము అడిగిన మొత్తాన్ని వారి తల్లిదండ్రులు ఇవ్వకపోవడంతో అతడి గొంతుకోసి చంపేశారు. చివరి కోరికగా రసగుల్లా తినిపించారు. 

పశ్చిమ బెంగాల్‌ : పశ్చిమ బెంగాల్‌ లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తోటి విద్యార్థిని కిడ్నాప్ చేసి.. తల్లిదండ్రులు తాము అడిగిన మొత్తం ఇవ్వలేదని గొంతుకోసి చంపేశారు ముగ్గురు సహవిద్యార్థులు. దారుణమైన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని నదియాలో వెలుగు చూసింది. 

ముగ్గురు విద్యార్థులు తమతోపాటు చదువుకునే ఒక విద్యార్థిని కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అతని కుటుంబానికి ఫోన్ చేసి రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. వారు ఆ మొత్తాన్ని చెల్లించకపోవడంతో ముగ్గురు సహవిద్యార్థులు అతని గొంతు కోసి చంపారు. విద్యార్థి చివరి కోరికగా..అతడికి కిడ్నాపర్లు రసగుల్లాలు, కూల్ డ్రింక్స్ అందించారు.

పదోతరగతి విద్యార్థిపై తోటి విద్యార్థులు దాడి.. చిక్సిత పొందుతూ మృతి.. కారణమదేనా..?

పిల్లల్లో పెరిగి పోతున్న నేరప్రవృత్తికి ఈ ఘటన అద్దం పడుతోంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా జిల్లాలో 8వ తరగతి విద్యార్థిని అతని సహవిద్యార్థులు ముగ్గురు కిడ్నాప్ చేసి, ఆపై గొంతు కోసి చంపారు.

కిడ్నాపర్లు చిన్నారి చివరి కోరికను తీర్చేందుకు చంపేముందు ‘రసగుల్లాస్’ (బెంగాలీ స్వీట్ డిష్), కూల్ డ్రింక్స్ కూడా అందించారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబీకులు తమ బిడ్డ కనిపించడం లేదని కృష్ణానగర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కుటుంబసభ్యుల కథనం ప్రకారం, శుక్రవారం నాడు బాధితుడైన విద్యార్థి తన స్నేహితులను కలవడానికి సైకిల్‌ మీద బయలుదేరి ఇంటినుంచి వెళ్లాడు. ఆ తరువాత ఇంటికి తిరిగి రాలేదు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాధితుడితో సహా ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన విద్యార్థులు గేమింగ్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసేందుకు బాలుడి కుటుంబం నుంచి రూ.3 లక్షలు డబ్బు డిమాండ్ చేశారు. అయితే, కిడ్నాపర్ల డిమాండ్లను కుటుంబ సభ్యులు తీర్చకపోవడంతో, వారు విద్యార్థిని గొంతు కోసి చంపారు.

చంపేముందు ఆ ముగ్గురు... బాధిత విద్యార్థిని చివరి కోరిక ఏమిటని అడిగారు. అతని చివరి కోరిక నెరవేర్చడానికి రసగుల్లా, కూల్ డ్రింక్స్ తెచ్చిచ్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో వేసి నిర్జన ప్రదేశంలో పడేశారు. గాలింపు చేపట్టిన పోలీసులకు మృతదేహం దొరికింది. 

నిందితులపై జువైనల్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఘటన అనంతరం స్థానికులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే వారిని పోలీసులు అదుపులోకి తెచ్చారు.

PREV
click me!

Recommended Stories

Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..
మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?