డ్రగ్స్ కేసు: మాజీ మంత్రి కొడుకు ఇంట్లో పోలీసుల సోదాలు

By narsimha lodeFirst Published Sep 15, 2020, 5:40 PM IST
Highlights

మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కొడుకు ఆదిత్య అల్వా కొడుకు భవనంపై మంగళవారం నాడు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు.కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  ఈ భవనంపై సోదాలు చేశారు.

బెంగుళూరు:మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కొడుకు ఆదిత్య అల్వా కొడుకు భవనంపై మంగళవారం నాడు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు.కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ కేసును దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు  ఈ భవనంపై సోదాలు చేశారు.

ఈ కేసులో ఆదిత్య అల్వా నిందితుడు.  సీసీబీ పోలీసులు ఈ కేసులో నిందితుల కోసం దర్యాప్తు చేస్తున్న సమయం నుండి ఆయన ఆచూకీ లేకుండా పోయాడని ఓ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది.

ఈ కేసులో ఇప్పటికే 15 మందిపై కేసులు నమోదు చేశారు. ఇందులో 9 మందిని అరెస్ట్ చేశారు. ఆదిత్య అల్వాకు చెందిన హౌస్ ఆఫ్ లైఫ్ లో సోదాలు సాగుతున్నాయని సీసీబీ పోలీసులు ప్రకటించారు.

హెబ్బల్ సరస్సు పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ కు కుడి పక్కన ఉన్న ఇంటిపై పోలీసులు దాడులు చేశారు.ఆదిత్య ఆల్వా ఈ ఇంట్లో  పార్టీలు నిర్వహించేవారని ఓ న్యూస్ ఏజెన్సీ ప్రకటించింది. ఈ బంగ్లా నాలుగు ఎకరాల్లో ఉంది.ఈ కేసులో రాగిణి ద్వివేది, సంజన, పార్టీ ఆర్గనైజర్ విరేన్ ఖన్నా, రియల్టర్ రాహుల్, ఆర్టీఓ క్లర్క్ బీకే రవిశంకర్ లు అరెస్టయ్యారు.

కన్నడ సినీ నటుడు, నటులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ చేసింది. దీంతో సీసీబీ ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తోంది.
 

click me!