కర్ణాటకలో త్వరలో ఎమర్జెన్సీ - మాజీ సీఎం బీఎస్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు

By Asianet NewsFirst Published Jun 6, 2023, 1:16 PM IST
Highlights

కర్ణాటకలో త్వరలో ఎమర్జెన్సీ వస్తుందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. బీజేపీ అనేక చోట్ల చాలా స్వల్వ ఓట్ల తేడాతో ఓడిపోయిందని చెప్పారు. 

కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర సీఎం, బీజేపీ సీనియర్ నేత బసవరాజ్ బొమ్మై తీవ్రస్థాయిలో విరుచుకుపపడ్డారు. త్వరలోనే రాష్ట్ర ప్రజలు ఎమర్జెన్సీని ఎదుర్కొంటారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత బీజేపీ నేతలు, ఎమ్మెల్యేల జిల్లా స్థాయి ఆత్మపరిశీలన సమావేశానికి ఆయన హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఫుడ్ బిల్లు షేరింగ్ విషయంలో గొడవ.. 18 ఏళ్ల యువకుడిని చంపిన నలుగురు స్నేహితులు.. ఎక్కడంటే ?

‘‘అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే గోవధ నిరోధక చట్టాన్ని ఉపసంహరించుకోవడం, పాఠ్యపుస్తకాలను సవరించడం, హిందూ ఉద్యమకారులను జైలుకు పంపడం వంటి వాటిపై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే మాట్లాడటం ప్రారంభించారు. తమను వ్యతిరేకించే ప్రతీ గొంతును అణచివేసేందుకు, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలు అతి త్వరలో ఎమర్జెన్సీ లాంటి పరిస్థితిని చూస్తారని నేను చెబుతున్నాను’’ అని బొమ్మై అన్నారు.

పదే పదే చాక్లెట్లు, బొమ్మలు, బట్టలు అడుగుతోందని కూతురిని చంపిన తండ్రి.. ఇండోర్ లో ఘటన

కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బసవరాజ్ బొమ్మై ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేయడానికి కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన తెలిపారు. కాబట్టి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా బీజేపీ మౌనంగా ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.

గుజరాత్ లో దారుణం.. క్రికెట్ బాల్ పట్టుకున్నాడని గొడవ.. దళిత యువకుడి బొటన వేలు నరికిన దుండగులు..

కాగా.. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయంపై మాట్లాడాలని మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన సమాధానమిస్తూ.. బీజేపీ చాలా చోట్ల స్వల్ప ఓట్ల తేడాతో సీట్లను కోల్పోయిందని బొమ్మై అన్నారు. తాము ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం పార్టీ ఓటమికి ఓ కారణం అయ్యింది. అలాగే కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించిన నియోజకవర్గాల్లో ఓట్లను ఏకీకృతం చేయడంలో వైఫల్యం చెందాము.’’ అని అన్నారు.

రైల్వేలో తిరిగి విధుల్లోకి చేరిన రెజ్లర్లు.. ఆందోళనపై వెనక్కి తగ్గేది లేదంటూ వ్యాఖ్యలు

ఇదిలా ఉండగా.. గత నెలలో వెలువడిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 135 స్థానాలు గెలుచుకోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 66 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. కింగ్ మేకర్ పాత్ర పోషించాలని భావించిన జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) 19 స్థానాలకే పరిమితమైంది.

click me!