ఐఎన్ఎక్స్ మీడియా కేసు: కార్తీ చిదంబరానికి ఈడీ షాక్.. ఆస్తుల స్వాధీనం

By sivanagaprasad kodatiFirst Published Oct 11, 2018, 12:15 PM IST
Highlights

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ షాకిచ్చింది.

అతనికి సంబంధించి భారత్‌తో పాటు బ్రిటన్, స్పెయిన్‌లలో ఉన్న రూ.54 కోట్ల ఆస్తులను ఈడీ గురువారం అటాచ్ చేసింది. 2007లో ఐఎన్ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి రూ. 305 కోట్లు మళ్లీంచడంలో కార్తీ చిదంబరం తండ్రి అధికారాన్ని వాడుకున్నారని ఈడీ ఆరోపించింది..

ఎఫ్ఐపీబీ గ్రీన్ సిగ్నల్ రావడంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయాన్ని ఆయన మేనేజ్ చేయడంతో పాటు మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆధారాలు సేకరించింది. ఇందుకు గాను ఐఎన్ఎక్స్ మీడియా నుంచి 100 మిలియన్ డాలర్లు ముడుపులుగా స్వీకరించారని సీబీఐ కేసు నమోదు చేసింది. 

ఐఎన్ఎక్స్ కేసు: చిదంబరాన్ని అరెస్ట్ చేయొద్దు

ఎయిర్‌సెల్- మ్యాక్సీస్ కేసు: కార్తీ చిదంబరానికి ఎదురుదెబ్బ..?

ఈడీ విచారణకు హాజరైన చిదంబరం

మొదలైన వేట
 
click me!