నవదంపతులపై దాడి.. వధువుపై అత్యాచారం

Published : Oct 11, 2018, 11:43 AM IST
నవదంపతులపై దాడి.. వధువుపై అత్యాచారం

సారాంశం

వరుడి చేతిపై కత్తితో దాడి చేశారు. స్వల్పగాయాలపాలైన అతను భార్యను అక్కడే వదిలి గ్రామంలోకి పరుగులు తీశాడు. 


నవ దంపతులపై దాడి చేసి ..  వధువుపై  నలుగురు వ్యక్తులు అత్యాచారినికి పాల్పడిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. తిరువల్లూరికి చెందిన  ఓ వ్యక్తికి ఇటీవల వివాహమైంది. తన భార్యతో కలిసి కుమరన్ నాయికన్ పేటలోని దేవాలయానికి వచ్చాడు.

దైవ దర్శనం అనంతరం నవదంపతులు ఇద్దరూ బైక్ పై తిరిగి ఇంటికి వెళ్తుండగా.. నలుగురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ నలుగురు నవ దంపతులపై దాడి చేశారు. వరుడి చేతిపై కత్తితో దాడి చేశారు. స్వల్పగాయాలపాలైన అతను భార్యను అక్కడే వదిలి గ్రామంలోకి పరుగులు తీశాడు. గ్రామంలోకి వెళ్లి ఎవరినైనా సహాయం తీసుకువద్దామనుకొని అతను పరుగులు తీయగా.. అదే అదునుగా భావించిన దుండగులు వధువుపై అత్యాచారానికి పాల్పడ్డారు.

గ్రామానికి ఒక కిలోమీటర్ దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. వరుడి సమాచారంతో గ్రామస్థులు అక్కడికి చేరుకోగా.. ఆలోపే నలుగురు దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను గాలించి పట్టుకున్నారు.

నిందితులు మునుస్వామి(36), మోహన్(29), మరో ఇద్దరు మైనర్లు గా గుర్తించారు. నలుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం