digital payment frauds: డిజిటల్ మోసాలను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా అనుమానస్పద లావాదేవీలు జరిగిన 70 లక్షల మొబైల్ నెంబర్లను సస్పెండ్ చేసింది. అలాగే ట్రాయ్ కూడా తన డీఎన్డీ యాప్ ను అప్ డేట్ చేస్తోంది.
70 lakh numbers suspended : డిజిటల్ మోసాలు అరికట్టేందుకు కేంద్ర కఠిన చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా అనుమానాస్పద లావాదేవీల జరిగిన 70 లక్షల మొబైల్ నంబర్లను ఒకే సారి సస్పెండ్ చేసింది. దీంతో ఈ నెంబర్ల నుంచి మళ్లీ డిజిటల్ లావాదేవీలు జరిగే అవకాశం ఉండదని కేంద్రం భావిస్తోంది.
‘పీటీఐ’ కథనం ప్రకారం.. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్)లో జరుగుతున్న మోసంపై ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి ఆందోళన వ్యక్తం చేశారు, దీనిని పరిశీలించి డేటా రక్షణను నిర్ధారించాలని రాష్ట్రాలను కోరారు. పెరుగుతున్న డిజిటల్ పేమెంట్ మోసాలను నివారించడానికి బ్యాంకులు తమ వ్యవస్థలను మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ఫైనాన్షియల్ సైబర్ సెక్యూరిటీని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మరిన్ని సమావేశాలను ప్లాన్ చేస్తోందని, తదుపరి సమావేశం జనవరిలో జరుగునుంది. అయితే ఇప్పటికే ఆర్థిక వ్యవహారాల శాఖ, రెవెన్యూ శాఖ, టెలికాం శాఖ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఎంఈఐటీవై), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వంటి వివిధ శాఖల ప్రతినిధులతో ప్రభుత్వ కార్యాలయాలు సమావేశమై ఆర్థిక సైబర్ భద్రతపై చర్చిస్తున్నాయి.
Telangana rains : తెలంగాణను ముంచెత్తిన వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..
కాగా.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా తన డూ నాట్ డిస్టర్బ్ (డీఎన్డీ) యాప్ ను అప్ డేట్ చేస్తోంది. నిరంతర స్పామ్ కాల్స్, సందేశాలను ఎదుర్కోవడమే దీని లక్ష్యం. మార్చి 2024 నాటికి అప్ డేట్ అయిన డీఎన్టీ అన్ని పరికరాలతో అనుకూలంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని వల్ల వినియోగదారులు మరింత ప్రభావంతంగా రిపోర్ట్ చేయవచ్చు.