మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా చేసే అజాన్ వల్ల శబ్ద కాలుష్యం జరుగుతుందని, దీని వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని, కాబట్టి లౌడ్ స్పీకర్లను నిషేదించాలని కోరుతూ భజరంగ్ దళ్ సభ్యుడు ఒకరు గుజరాత్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అయితే దీనిని కోర్టు తోసిపుచ్చింది.
అజాన్ కోసం మసీదుల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించడం వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడదని గుజరాత్ హైకోర్టు తెలిపింది. మసీదుల్లో ప్రార్థన కోసం లౌడ్ స్పీకర్లను ఉపయోగించడంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని గుజరాత్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ వాదన ‘పూర్తిగా తప్పుడు ఊహ’ అని పేర్కొంది.
లౌడ్ స్పీకర్ల ద్వారా ఆజాన్ చేయడం వల్ల శబ్ద కాలుష్యం ఏర్పడుతుందని, ప్రజల, ముఖ్యంగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, దీని వల్ల వారు అసౌకర్యానికి కారణమవుతున్నారని భజరంగ్ దళ్ నేత శక్తిసిన్హ్ జాలా పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిని గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, జస్టిస్ అనిరుద్ధ పి మాయీలతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్ విచారించింది. పిటిషన్‌లోని వాదనలకు శాస్త్రీయ ఆధారాలు లేవని హైకోర్టు పేర్కొంది.
ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ.. ఉదయం సమయంలో ఆజాన్ చేసే మానవ స్వరం ధ్వని కాలుష్యాన్ని సృష్టించే స్థాయికి ఎలా చేరుకోగలదో అర్థం కావడం లేదని పేర్కొంది. దీనివల్ల ప్రజలకు ఆరోగ్యానికి హాని కలుగదని చెప్పింది. ‘‘మీ (పిటిషనర్ ను ఉద్దేశించి) గుడిలో వేకువజామున 3 గంటలకు డప్పులు, సంగీతంతో హారతి కూడా మొదలవుతుంది. అయితే ఇది ఎవరికీ ఎటువంటి శబ్దాన్ని కలిగించదా? గుడిలో గంట, డియాల్ శబ్దాలు ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉంటాయని మీరు చెప్పగలరా? ఆలయం వెలుపలకు వినిపించవా’ ? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.
Telangana rains : తెలంగాణను ముంచెత్తిన వర్షాలు.. మరో రెండు రోజులూ ఇదే పరిస్థితి..
ఇలాంటి పిల్ ను విచారించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది ఏళ్ల తరబడి నుంచి కొనసాగుతున్న విశ్వాసం, ఆచరణ అని తెలిపింది. ఈ అజాన్ 5-10 నిమిషాల పాటే ఉంటుందని కోర్టు పేర్కొంది. అది కూడా రోజులో వేర్వేరు సమయాల్లో అజాన్ నిర్వహిస్తున్నారని విచారణ సందర్భంగా కోర్టు గుర్తు చేసింది.
telangana election poll : స్వతంత్రులు ప్రధాన పార్టీల అభ్యర్థుల తలరాతలు మార్చనున్నారా?...
ధ్వని కాలుష్యాన్ని కొలవడానికి శాస్త్రీయ పద్ధతి ఉందని, అయితే పది నిమిషాల ఆజాన్ శబ్ద కాలుష్యానికి కారణమవుతుందని నిరూపించడానికి పిటిషనర్ ఒక నిర్దిష్ట ప్రాంతానికి అటువంటి డేటాను అందించడంలో విఫలమయ్యారని ధర్మాసనం తెలిపింది. లౌడ్ స్పీకర్ల ద్వారా అజాన్ జరిగే పరిసరాల్లో వివిధ వర్గాలు, మతాలకు చెందిన ప్రజలు నివసిస్తున్నారని, దీనివల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందనేది మాత్రమే పిటిషనర్ చేసిన ఏకైక వాదన అని కోర్టు తెలిపింది.