Narendra Modi.. మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రం: ఈ నెల 30న ప్రారంభించనున్న నరేంద్ర మోడీ

By narsimha lode  |  First Published Nov 29, 2023, 12:31 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో  సంభాషించనున్నారు.



న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  ఈ నెల  30న  విక్షిత్  భారత్ సంకల్ప్ యాత్ర  లబ్ధిదారులతో  సంభాషించనున్నారు. ఈ నెల  30న ఉదయం 11 గంటలకు  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  విక్షిత్  భారత్ సంకల్ప్ యాత్ర లబ్దిదారులతో  మోడీ మాట్లాడుతారు.  

మహిళా కిసాన్ డ్రోన్ కేంద్రాన్ని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.  మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్ లను  ప్రభుత్వం అందిస్తుంది. ఈ డ్రోన్లను తమ జీవనోపాధి కోసం మహిళలు ఉపయోగించుకోవచ్చు.  దేశంలోని  స్వయం సహాయక సంఘాలకు  15 వేల డ్రోన్లను అందించనున్నారు. వచ్చే మూడేళ్లలో ఈ డ్రోన్లను అందించాలని మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.  డ్రోన్ల వినియోగంపై మహిళలకు  శిక్షణను ఇవ్వనున్నారు. వ్యవసాయ రంగంలో ఈ డ్రోన్లను ఉపయోగించుకొనేలా ఈ శిక్షణ ఇవ్వాలని మోడీ సర్కార్ భావిస్తుంది.

Latest Videos

మరో వైపు  ఆరోగ్య సంరక్షణ విషయంలో కూడ మోడీ సర్కార్  చర్యలు తీసుకుంటుంది.  మందులను సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకు రావడం కోసం జన్ ఔషధి కేంద్రాన్ని స్థాపించడం  ఇందులో భాగమే.  డియోఘర్‌లోని  ఎయిమ్స్ లో   10వేల జన ఔషది కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  జాతికి అంకితం చేస్తారు. జన ఔషది  సంఖ్యను  10 వేల నుండి 25 వేలకు పెంచాలని కేంద్రం భావిస్తుంది.

మహిళా స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు అందించడం,  జన ఔషది కేంద్రాల సంఖ్య ను 10 వేల నుండి  25 వేలకు పెంచాలని  ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్న విషయం తెలిసిందే.

click me!