షార్ట్‌లు వేసుకున్న అమ్మాయిల్ని రేప్ చేయమన్న ఆంటీ క్షమాపణలు

By Siva KodatiFirst Published May 2, 2019, 8:00 PM IST
Highlights

నగ్నంగా కనిపించేందుకు, రేప్ చేయించుకునేందుకు ఈ లేడీస్ షార్ట్ డ్రస్సులు ధరిస్తున్నారని.. ఇలాంటి వారిని అవకాశం వచ్చినప్పుడల్లా రేప్ చేయండి అంటూ ఢిల్లీకి చెందిన ఓ మహిళ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. 

దీంతో ఆమె తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు కోరింది. తన వ్యాఖ్యలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయని, చాలా తప్పుగా మాట్లాడానని తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా తెలిపింది. అనంతరం ఆమె తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిని తొలగించింది.

ఓ రెస్టారెంట్‌లో తన మిత్రులతో ఉండగా.. ఓ మహిళ తన వద్దకు వచ్చి.. పొట్టిగా ఉన్న దుస్తులు వేసుకున్నందుకు సిగ్గుపడు అంటూ పేర్కొందని.. దీంతో తాము తన స్నేహితులు ఆమెతో వాదనకు దిగామని .. దీంతో ఆమె మరింత రెచ్చిపోయింది.

ఇలాంటి దుస్తులు వేసుకున్న మహిళలను అవకాశం వచ్చినప్పుడల్లా రేప్ చేయాలంటూ రెస్టారెంట్‌లో ఉన్న మగవారికి చెప్పిందని ఢిల్లీకి చెందిన ఓ యువతి ఆమె వ్యాఖ్యలను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టింది. 

click me!