మోదీ హత్యకు కుట్ర: హత్య చేస్తామంటూ సీపీకి మెయిల్

By Nagaraju TFirst Published Oct 13, 2018, 4:18 PM IST
Highlights

 ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ రావడం సంచలనం రేపుతోంది. హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు మెయిల్ పంపడం కలకలం రేపుతోంది. ఆగంతకుడి మెయిల్ తో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఈ-మెయిల్‌ రావడం సంచలనం రేపుతోంది. హత్య చేస్తామంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు మెయిల్ పంపడం కలకలం రేపుతోంది. ఆగంతకుడి మెయిల్ తో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. 

మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది ఎవరు పంపించారన్న అంశాలపై ఆరా తీశారు. కేవలం ఒక్కలైను మెసేజ్ మాత్రమే మెయిల్ చేశాడు ఆగంతకుడు. ఆ మెయిల్ లో 2019లోని ఓ తేదీని సైతం పేర్కొన్నాడు. ఆ రోజు ప్రధాని మోదీపై దాడి జరుపుతామంటూ దుండగుడు పేర్కొన్నాడు. అయితే తేదీ వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు బహిర్గతం చెయ్యలేదు. అయితే కమిషనర్ కు మెయిల్ అసోంలోని ఓ జైలు నుంచి వచ్చిందని తెలుస్తోంది.  

మోదీ హత్యపై మెయిల్ రావడంతో అటు నిఘా వర్గాలు సైతం అప్రమత్తమయ్యాయి. దర్యాప్తు ప్రారంభించాయి. అటు ఎన్నికల సమయం సమీపిస్తున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల్లో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు.  

ఈ ఏడాది జూన్ లో భీమా కొరెగావ్ కేసులో పూణేలోని ఒకరి ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న పోలీసులకు ఓ లేఖ లభించింది. ఈ ఏడాది మోదీ హత్యకు మావోయిస్టులు కుట్రకు సంబంధించి సమాచారం లభించింది. ఆ లేఖలో ప్రముఖ విప్లవ కవి విరసం నేత వరవరరావు పేరు ప్రస్తావన సైతం వచ్చింది. భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య తరహాలోనే మోదీపై దాడి చేయాలని మావోయిస్టులు కుట్ర పన్నినట్లు అప్పట్లో పోలీసులకు తెలిసింది. 

ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించి పూణే పోలీసులు వరవరరావుతోపాటు పలువురిని అరెస్ట్ చేశారు. అలాగే మహారాష్ట్రలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారంతా గృహనిర్బంధంలో ఉన్నారు. ఆ ఘటన మరువకముందే మోదీని హత్య చేస్తామంటూ ఏకంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. 
 

ఈ వార్తలు కూడా చదవండి

వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు.. ఐపీఎస్‌పై సుప్రీం కన్నెర్ర

ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

click me!